ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాలు జరిగేవి కాదు.. ఎక్కువగా చెన్నైలో షూటింగ్ జరుగుతూ ఉండేది.. ప్రతి దానికి చెన్నై మీదే ఆధారపడి ఉండేవారు. నటీనటుల ఇల్లులు కూడా అక్కడే ఉండేవి..ఇలాంటి పరిస్థితి ఉన్న రోజులలో సినీ ఇండస్ట్రీ చెన్నైలోనే కాదు మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఉండాలని చెన్నై నుంచి సినీ పరిశ్రమను ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అందుకు ముఖ్య కారణం ANR అని చెప్పవచ్చు. అప్పట్లో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మరియు బంజారా హిల్స్ చాలా దట్టమైన అడవిగా ఉండేవి.
చాలా పెద్ద కొండలతో ఒక ఇల్లు కూడా ఉండేవి కాదు.. అలాంటి చోట ANR స్టూడియోను స్థాపించి ఇవ్వడం జరిగింది. మొదట్లో కనీసం ఒక్క సినిమా షూటింగ్ కూడా జరిగేది కాదట. అలాంటి స్థాయి నుండి నేడు ఇండియాలోనే టాప్ మోస్ట్ స్టూడియో గా పేరు పొందింది. ప్రతి సీరియల్ సినిమా షూటింగ్స్ ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలు కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతూ ఉంటాయి. గతంలో అన్నపూర్ణ స్టూడియోలలో చాలా తీవ్రమైన నష్టలను ఎదుర్కున్నాడట.
నెలలోపు అప్పు కట్టలేక బ్యాంకు రుణాలను కట్టలేక చాలా దివాలా స్థాయికి చేరిందట. ఈ విషయాన్ని నాగర్జున బయటికి రానిచ్చేవారు కాదట. తాను సంపాదించిన డబ్బుతోనే ఈ స్టూడియోను ఆదుకునే వారట.ఈ స్టూడియో ని నమ్ముకొని చాలామంది కార్మికుల జీవితాలను ఉన్నాయని నాగేశ్వరరావు సోదరుడు అక్కినేని వెంకట్ తెలియజేశారు. ఒకప్పుడు అక్కినేని వెంకట్ అన్నపూర్ణ స్టూడియో కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను చూసుకునేవారు. అలా ఆయన ఆధ్వర్యంలో కొంతకాలం తర్వాత నష్టాలు వచ్చాయని తాను మైంటైన్ చేయలేక నాగార్జున చేతిలో పెట్టానని తెలిపారు. ఆ తర్వాత నాగార్జున కృషితోని ANR స్టూడియో నిలబడిందని తెలిపారు. నాగేశ్వరరావు గారి మనవరాలు సుప్రియ కూడా మేనేజ్ చేస్తోంది.