దీపావళి రోజు ఈ జంతువులు తారసపడితే ధనప్రాప్తి కలుగుతుందని మీకు తెలుసా..

హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగను ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇంటిని దీపాల‌తో అలంక‌రించి లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం దీపావళి రోజున కొన్ని రకాల జంతువులను చూడటం వల్ల ధనప్రాప్తి కలుగుతుందట. అదృష్టం వరిస్తుందట. అవేంటో ఒకసారి చూద్దాం. సునక శాస్త్రం ప్రకారం దీపావళి రోజున కుంకుమపువ్వు రంగులో ఉన్న ఆవుని చూస్తే శుభప్రదంగా భావిస్తారు.

దీపావళి రోజున ఆవుని దర్శించుకోవడం వల్ల చాలా శుభం కలుగుతుంది. అంతేకాకుండా లక్ష్మీ పూజ అనంతరం బల్లులు కనిపించినట్లయితే కూడా చాలా మంచిద‌ట‌. దీపావళి రోజున గుడ్లగూబని చూసిన మంచి జరుగుతుందట. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం దీపావళి రోజున రాత్రి సమయంలో గుడ్లగూబని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట.

దీపావళి పండుగ రోజున ఇంట్లో ఎలుకలు కనిపించిన అదృష్టంగానే భావించాలట. సునక శాస్త్రం ప్రకారం ఎలుకలు కనిపిస్తే ధన ప్రాప్తి కలుగుతుందట. అయితే అశుభంగా భావించే పిల్లి కూడా దీపావళి రోజు ఇంట్లోకి అడుగుపెడితే లక్ష్మీదేవి వ‌స్తున్న‌ట్టు భావించాలట. ఈ పై జంతువుల్లో ఏది మనకు దీపావళి రోజున కనిపించిన శుభప్రదం అని, అదృష్టం, ధ‌న‌ ప్రాప్తి, సుఖశాంతులు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి.