పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన సినీ కెరీర్ ప్రారంభం నుంచి రూపొందించిన అన్ని సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇక చివరిగా రూపొందించిన పాన్ ఇండియా సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అందుకుని తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచారు. అలాంటి రాజమౌళి తను దర్శకత్వం వహించిన ఓ సినిమాలో పాట అసలు నచ్చకపోయినా దానిని అలాగే ఉంచారట. అయితే ఆ పాట మంచి మ్యూజికల్ హిట్గా నిలిచింది. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో.. నచ్చకపోయినా ఎందుకు సినిమాలో ఉంచవలసి వచ్చిందో.. ఒకసారి చూద్దాం.
రాజమౌళి సినీ కెరీర్ లో మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాతో వీరిద్దరి సినీ కెరీర్ మంచి మలుపు తిరిగిందని చెప్పాలి. అయితే ఈ సినిమాలోని పాటలన్నీ మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి. అప్పుడప్పుడు రాఘవేంద్రరావు కి కీరవాణి వద్దకు వచ్చి పాటలను విని ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేవారట. అలాగే పడ్డానండి ప్రేమలో మరి సాంగ్ కి కూడా ఈ సాంగ్ చాలా బాగుంది.. ఈ సాంగ్ సినిమాలో పెడితే కచ్చితంగా హిట్ అవుతుంది అంటూ చెప్పారట. కాగా తర్వాత రోజు రాజమౌళి.. కీరవాణి వద్దకు వెళ్లి ఆ పాట విని ఏంటి అన్నయ్య ఇది.. ” పడ్డానండి ప్రేమలో మరి ” అంటూ.. అసలు ఈ పాట బాలేదు తీసేద్దాం అని అన్నాడట.
అప్పుడు కీరవాణి నిన్న రాఘవేందర్ రావు గారు విని చాలా బాగుంది ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పారు.. మరి నువ్వేంటి పాట బాగోలేదు అంటున్నావ్ అని అన్నారట. అయితే రాజమౌళి మాట్లాడుతూ ఆయన హిట్ అవుతుందని చెప్పారా.. అయితే సరే ఆ పాటను ఉంచుదాం. అని రాజమౌళి చెప్పేసి వెళ్లిపోయారట. కానీ ఆ పాట రాజమౌళికి అసలు నచ్చలేదు. కేవలం రాఘవేంద్రరావు గారి మాటకు గౌరవం ఇచ్చి సినిమాలో ఆ సాంగ్ ఉంచాడు. అయితే ఈ సాంగ్ స్టూడెంట్ నెంబర్ వన్ మూవీలోనే పెద్ద మ్యూజికల్ హిట్.