“భార్య బర్త డే కి ఆ మాత్రం చేయలేవా రా..?”.. స్టార్ హీరోని ఏకేస్తున్న హీరోయిన్ ఫ్యాన్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పర్సనల్గా హీరో హీరోయిన్స్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేయడం పరిపాటిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని ఎలా ఏకేస్తున్నారో జనాలు మనం చూస్తూనే వచ్చాం. అయితే రీసెంట్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం అలాగే ట్రోల్ చేస్తున్నారు. రీజన్స్ ఏంటో తెలియదు కానీ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది .

అలాంటిదేవీ లేదు రా బాబోయ్ అని నెత్తి నోరు మొత్తుకున్నా కూడా జనాలు నమ్మట్లేదు. అయితే రీసెంట్గా ఐశ్వర్యరాయ్ తన 50వ పుట్టినరోజును చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది . దీంతో అభిషేక్ బచ్చన్ ని ట్రోల్ చేస్తున్నారు జనాలు. ” నీ భార్య 50వ పుట్టినరోజుని ఎంత ఘనంగా సెలబ్రేట్ చేయాలి..? అది మైల్ స్టోన్.. మరి నువ్వు సింపుల్ గా హ్యాపీ బర్త్డ డే అని చెప్తే ఎలా..?

హ్యాపీ బర్త్డ డే మై లవ్.. డార్లింగ్స్.. స్వీటీ.. ఏదో ఒకటి చెప్పాలిగా . ఆ మాత్రం సెన్స్ లేదా..? మీ నాన్న పుట్టినరోజు అయితే పెద్ద పెద్ద చాటభారతాన్ని రాస్తావే అంటూ ట్రోల్ చేస్తున్నారు . దీంతో ఐశ్వర్యరాయ్ అభిషేకం మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమే అని పరోక్షంగా కన్ఫామ్ చేసినట్లయింది ఈ జంట..!!