16 ఏళ్లే ఉంటావని తెలుసుంటే అలా చేసేదాన్నే కాదు.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న విజ‌య్ ఆంటోనీ వైఫ్ ట్వీట్‌!

బిచ్చ‌గాడు మూవీతో అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో విజ‌య్ ఆంటోనీ ఇంట ఇటీవ‌ల తీవ్ర విషాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పెద్ద కూతురు మీరా ఆంటోనీ(16) ఇంట్లో డిప్రెష‌న్ కార‌ణంగా సూసైడ్ చేసుకుని చ‌నిపోయింది. సెప్టెంబర్ 19న ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. మీరా బలవన్మరణం విజయ్ కుటుంబానికి అంతులేని దు:ఖాన్ని మిగిల్చింది.

అతి చిన్న వ‌య‌సులోనే మీరా తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌డం అంద‌రినీ తీవ్రంగా క‌ల‌చివేసింది. అయితే కూతురి మ‌ర‌ణాన్ని తిగ‌మింగుకుని విజ‌య్ ఆంటోనీ మ‌ళ్లీ వ‌ర్క్ తో బిజీ అయ్యాడు. కానీ, ఆయ‌న స‌తీమ‌ణి ఫాతిమా మాత్రం ఇంకా కూతురు లేద‌న్న విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. క‌డుపు కోత‌తో తాజాగా ఫాతిమా చేసిన ట్వీట్ అంద‌రి చేత క‌న్నీళ్లు పెట్టిస్తోంది.

`నువ్వు 16 ఏళ్లు మాత్రమే జీవించి ఉంటావ‌ని తెలుసుంటే.. నిన్ను ప్రతీక్షణం నా దగ్గరే పెట్టుకునే దాన్ని.. కనీసం నీకు ఈ ప్రపంచాన్ని, సూర్యచంద్రుల్ని కూడా చూపించే దాన్ని కాదు. నీ ఆలోచనలతోనే ప్రతీక్షణం చనిపోతున్నాను. నువ్వు లేకుండా ఉండలేక‌పోతున్నాను. నేను, నాన్న‌, లారా నీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాము..మా కోసం నువ్వు తిరిగి వ‌చ్చేయ్‌` అని కూతురు మీరాను త‌లుచుకుంటూ చాలా ఎమోష‌న‌ల్ గా ఫాతిమా ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు ఫాతిమాకు ధైర్యం చెబుతున్నారు.