ఆ పువ్వు దిండి కింద పెట్టుకుంటే చాలు.. రెండు నిమిషాల్లో గాఢ నిద్రలోకి..!!

నేటి కాలంలో అనేక కారణాలతో నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది. ఆర్థిక‌ పరిస్థితులు, వర్క్ టెన్షన్.. ఇవన్నీ కూడా చక్కని నిద్రను దూరం చేస్తున్నాయి. అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. అందుకని కొంతమంది నిద్ర పట్టడం కోసం ఆల్కహాల్ తీసుకుంటున్నారు. మరి కొందరు ఏకంగా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు.

కానీ అది తాత్కాలిక పరిష్కారం తప్ప.. శాశ్వత పరిష్కారం కాదు. ఇలాంటివి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చక్కటి పరిష్కారాన్ని చూపిస్తున్నారు పెద్దలు. అదే గోరింట పువ్వు. గోరింట పువ్వు గురించి మీరు వినే ఉంటారు. గుత్తులు గుత్తులుగా మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఈ పువ్వు దిండి కింద పెట్టుకుని పడుకుంటే చక్కగా నిద్ర పడుతుంది.

ఈ పువ్వు నుంచి వచ్చే సువాసన మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. చిన్నపిల్లలు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎంత గాఢంగా నిద్రపోతారో అలాంటి నిద్రను అనుభవిస్తారు. పూర్వికులు ఈ చిట్కాలను ఉపయోగించి ప్రయోజనం పొందగా.. ఇక ఈ ట్రిక్ ఎవ‌రు వాడినా చక్కని ఫలితం ఉంటుందని చెబుతున్నారు పెద్ద‌లు.