బుల్లితెర నుంచి కెరియర్ స్టార్ట్ చేసిన స్టార్ సెలబ్రిటీలు వీళ్లే..!

సినిమా ఇండస్ట్రీలో అనుకున్నది సాధించాలి అంటే ముందుగా మనల్ని వరించిన పాత్రే మనం చేయాల్సి ఉంటుంది. అలా నేడు ఫేమస్ సెలబ్రిటీలుగా టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలను ఏలుతున్న చాలామంది మొదట బుల్లితెర నుంచి వచ్చినవారే.. అలా బుల్లితెర నుంచి కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు సినిమాలలో స్టార్ సెలబ్రిటీలుగా మారిన వారి గురించి ఇప్పుడు చూద్దాం.

Yash asks people to not disrespect Bollywood after success of south films -  Hindustan Times

యష్: భారతీయ సినిమాలలో ప్రముఖ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరో యష్.. ఒకప్పుడు చిన్న పాత్రలు చేస్తూ ఉండేవాడు. వాస్తవానికి సీరియల్స్ తోనే తన నటనా ప్రస్తానాన్ని ప్రారంభించి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయారు.

మృణాల్ ఠాకూర్ - వికీపీడియా

మృణాల్ ఠాకూర్: సీతారామం సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అప్పటికే హిందీ సీరియల్స్ లో నటించి మంచి పేరు దక్కించుకుంది. ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది.

విజయ్ సేతుపతి: తమిళ్, తెలుగు సినిమాలలో నటిస్తూ బహుముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి కూడా తన కెరీర్ను మొదటిగా సీరియల్ ద్వారానే ప్రారంభించారు. తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు భారీ క్రేజ్ సొంతం చేసుకోవడమే కాదు తెలుగు సినిమాలలో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయారు.

కలర్స్ స్వాతి: బుల్లితెరపై వచ్చిన కలర్స్ అనే ప్రోగ్రాంలో యాంకర్ గా చేసిన స్వాతి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. స్వామి రారా, కార్తికేయ తో పాటు మరికొన్ని చిత్రాలలో నటించింది.

హన్సిక: హీరోయిన్ హన్సిక మొదట తన కెరియర్ను బుల్లితెరపైనే మొదలు పెట్టింది. తన ప్రతిభతో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పక్కన నటించి ఎన్నో హిట్ సినిమాలు చేసింది.

వీరితోపాటు మౌని రాయ్ , వాణి భోజన్, అవికాగోర్, ప్రియా భవాని శంకర్ తదితరులు బుల్లితెర నుంచి వచ్చి ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలు గా కొనసాగుతున్నారు.