చిరంజీవి కూతురిని టార్చర్ చేసిన హీరో… బయటకు రాని విషయాలు?

తెలుగు తెర వెలుగు మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులకు ముగ్గురు పిల్లలన్న సంగతి అందరికీ విదితమే. అందులో రామ్ చరణ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఒక ఏలు ఏలుతున్న సంగతి తెలిసినదే. అదేవిధంగా చిరు పెద్ద కూతురు సుస్మిత కూడా వివిధ సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వర్క్ చేస్తూ బిజీగా వుంటున్నారు. ఈ మధ్యకాలంలో చిరుతో కలిసి ఆమె ఓ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక శ్రీజ గురించి అందరికీ తెలిసినదే. అయితే మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత మొదట్లో హీరోయిన్ కావాలని కలలు కనేదాట. ఈ క్రమంలోనే హీరో ఉదయ్ కిరణ్ తన సినిమాలో సుస్మితను హీరోయిన్ గా పెట్టుకోవాలని అనుకున్నాడట.

అయితే ఈ విషయమై ఓ డైరెక్టర్ సినిమా తీయాలని కథ రెడీ చేసుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి కాంబినేషన్లో సినిమా తెరకెక్క లేదని వినికిడి. ఇక అసలు విషయంలోకి వెళితే, సుస్మిత అప్పట్లో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతుందని మీడియాలో వార్తలు వచ్చిన సమయంలో విషయం తెలుసుకొని ఉదయ్ సుస్మిత నెంబర్ కనుక్కొని ఆమెకు మెసేజ్లు చేస్తూ తన సినిమాలో హీరోయిన్ గా చేయమని అడిగేవాడట. ఈ క్రమంలో అర్ధరాత్రి కూడా ఆమెను వదలకుండా ఏదో ఒక మెసేజ్ చేస్తూ విసిగించేవాడట. అయితే విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుంది అని భావించిన సుస్మిత ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా తనలో తానే కుమిలిపోయేదట.

అయితే ఆ మెసేజ్ల సంఖ్య రోజురోజుకి హద్దులు మీరడంతో ఏం చేయాలో తెలియక సుస్మిత ఏకంగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి జరిగిన తంతు గురించి వివరించి ఆ మెసేజ్లు చూపిస్తూ రోజు టార్చర్ చేస్తున్నాడు అని చెప్పిందట. దాంతో పవన్ నేరుగా సదరు హీరో ఇంటికి వెళ్ళి… ఫ్యామిలీ జోలికి వస్తే క్షణం కూడా ఆలోచించని వార్నింగ్ ఇచ్చాడట. ఒక స్టేజులో నా కూతురికి అలాంటి మెసేజులు చేస్తావా అని గట్టిగా కొట్టాడట. దాంతో భయపడిపోయిన ఆ హీరో ఇంటికి వెళ్లి మరీ సుస్మిత కు క్షమాపణలు కూడా చెప్పారట.