లంగా వోణీల అచ్చ తెలుగు అమ్మాయిగా కిక్కిస్తున్న శ్రీలీల అందాలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ శ్రీలీల.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలకు సైతం ఫేవరెట్ జోడిగా మారిపోయింది. ఈమెతో రొమాన్స్ చేయడానికి చాలామంది హీరోలు సైతం సిద్ధంగానే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే బాలయ్య కూతురు పాత్రలో భగవంత్ కేసరి సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వగా మంచి హైప్ ఏర్పడింది. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో ఏకాంగ 10 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

నిన్నటి రోజున భగవంత్ కేసరి ట్రైలర్ ని వరంగల్లో విడుదల చేయడం జరిగింది. అయితే ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది హీరోయిన్ శ్రీ లీల.. లెహంగాలో మెరుస్తూ ఈవెంట్ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. తన చిలిపి నవ్వులతో తెగ సందడి చేస్తోంది.. బాలయ్య పక్కనే ఉంటూ శ్రీ లీల అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది.సీనియర్ హీరోయిన్ కాజల్ ఉన్నప్పటికీ శ్రీలీల హవాని ఎక్కువగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

Image

అయితే ఇందులో హాఫ్ శారీలో పల్లెటూరు తనాన్ని తలపిస్తున్న శ్రీ లీల అందంతో కుర్రాళ్ళ మతులు పోగొట్టేలా చేస్తోంది. మెడలో నల్లటి తాడుతో పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తోంది.భగవంత్ కేసరీ సినిమా స్టోరీ మొత్తం శ్రీ లీల చుట్టే తిరిగేలా కనిపిస్తున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

బాలయ్య శ్రీ లీలా అని ఆర్మీలోకి పంపించాలనుకుంటాడు కానీ ఆమె మాత్రం అందుకు అఇష్టంగానే ఉంటుంది అయినప్పటికీ బాలయ్య తన పట్టుదలతో ఆమెను కఠినమైన వ్యాయామాలు వంటివి చేయిస్తూ ఉంటారు. సినిమా స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అదిరిపోయేలా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లెహంగాలో శ్రీ లీల ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.