పూజ హెగ్డేకి గాయాలు.. ఫోటోలు వైరల్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!!

టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే కెరియర్ అంత సజావుగా సాగలేదని చెప్పవచ్చు.. గతంలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు అందుకోలేక పోతోంది. పూజ హెగ్డే చేతుల్లో కూడా ప్రస్తుతం సినిమాలు లేవని తెలుస్తోంది. అయినా కూడా ఆమె హంగామా తగ్గలేదు. ఇలాంటి సమయంలోనే తనని మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకుంటోంది. ఒకపక్క వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూనే జిమ్ వర్కౌట్లతో హడావిడి చేస్తూ ఉంటుంది

సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తూ ఉంటుంది.
తాజాగా పూజా హెగ్డే తన కాలికి గాయమైనట్టుగా ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.. తన రెండు మోకాళ్ళకు జరిగినటువంటి గాయాలను చూపిస్తూ బాక్సింగ్ నేర్చుకుంటున్న సమయంలో ఇలా గాయాలు అయ్యాయని తెలియజేస్తోంది.. అయితే ఎప్పుడు లేనిది సడన్గా పూజ హెగ్డే బాక్సింగ్ నేర్చుకోవడానికి గల కారణం ఏంటనే విషయం పైన అభిమానులు ఆరాతిస్తున్నారు.

అయితే గతంలో కూడా బాక్సింగ్ ను నేర్చుకుంటున్నట్లుగా ఒక వీడియోని సైతం షేర్ చేసింది. సినిమా కోసం నేర్చుకుంటుందా లేకపోతే నార్మల్గానే నేర్చుకుంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.. తన కాలికి గాయమైన ఫోటోని సైతం షేర్ చేయగ ఈ ఫోటో చూసినా అభిమానులు.. అయ్యో పూజ చూసుకోవాలి కదరా.. చూడు ఎంత పెద్ద గాయం తగిలిందో అంటూ ఆమెను బుజ్జగిస్తున్నారు. మరి కొంతమంది అభిమానులు సైతం గాయాలు తగిలితే హాస్పిటల్ కి వెళ్ళాలి కానీ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తే సరిపోతుందా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.