ఈ రసం తాగితే అమ్మాయిలు-అబ్బాయిలు ఇరగదీసేస్తారు… వద్దన్నా సరే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు…!!

క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మన శరీరానికి కావాల్సిన పోషకాలను ఇచ్చి మనం ఎల్లప్పుడూ దృఢంగా ఉండేలా చూసుకుంటుంది. అంతేకాకుండా సౌందర్యానికి కూడా క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ లో ఉండే ఫైటో కెమికల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

క్యారెట్ రసం క్రమం తప్పకుండా తాగితే అందం మీ సొంతం. క్యారెట్ లో విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్స్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది తాగడం వల్ల రక్తపోటుని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. కప్పు క్యారెట్ రసంలో గ్లాసు పాలు, కొద్దిగా తేనె కలిపి పది బాదం పప్పులతో తీసుకుంటే జీర్ణశక్తి పుష్కలంగా ఉంటుంది.

అలాగే పచ్చి దుంపలను తింటే నులుపురుగు లాంటి చెడు పదార్థాలు కూడా తొలగిపోతాయి. అందువల్ల వారానికి కనీసం రెండు మూడు సార్లు అయినా క్యారెట్ తినడం చాలా ఉత్తమం. అంతేకాకుండా క్యారెట్ ని తినడం వల్ల రంగు ,అందం కూడా పెరుగుతుంది.కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలు కూడా ఈ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చాలా చాలా హెల్దీగా ఉంటారు.

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో .. స్ట్రెస్ కి గురైపోతున్న అబ్బాయిలని చాలా ఎక్కువమందిని చూస్తున్నాము. అలానే కంప్యూటర్ల ముందు గంటల గంటలు కూర్చుని ఒంట్లో కొవ్వు సైతం పెరిగిపోతుంది. అలాంటి వాళ్లు రోజు క్రమం తప్పకుండా ఒక గ్లాసు ఈ క్యారెట్ జ్యూస్ తాగితే హెల్తీగా ఉంటారు. ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా. మంచి యాక్టివ్ గా… మీ పనులు మీరే చేసుకుంటూ చకచకా పరుగులు తీస్తారు.