Sr.NTR-బాలయ్య-NTR-మోక్షజ్ఞ: వీళ్ల నలుగురిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని నందమూరి ఫ్యామిలీకి క్రియేట్ చేసి పెట్టారు . కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల పరంగా కూడా నెంబర్ వన్ అంటూ ప్రూవ్ చేసి జనాలకు ఎన్నో మంచి పనులు చేసి పెట్టారు. ఎన్నెన్నో కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు . ఆ పథకాలు వల్ల ఇప్పటికీ మనం లబ్ధి పొందుతున్నాము అని గుర్తుంచుకోవాలి .

అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ – బాలయ్య – ఎన్టీఆర్ – మోక్షజ్ఞలో ఉన్న కామన్ క్వాలిటీని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. జనరల్ గా నందమూరి ఫ్యామిలీలోని హీరోలకు కోపం ఎక్కువ అని అందరూ అంటుంటారు. అఫ్ కోర్స్ అది నిజమే .. కోపం ఊరికే రాదు ..తప్పు పనులు చేసినప్పుడే వస్తుంది .

అయితే నందమూరి కుటుంబంలో హెల్పింగ్ నేచర్ ఉన్న హీరోలు కూడా ఉన్నారు. పైకి ఆ సహాయం చేశాను ..ఈ సహాయం చేశామని డప్పు కొట్టుకోరు . కానీ బాలయ్య – ఎన్టీఆర్ – మోక్షజ్ఞ చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు . అయితే వీళ్ళకి ఆ క్వాలిటీ సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి వచ్చింది అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. సీనియర్ ఎన్టీఆర్ తన ఇంటి వద్దకు వచ్చిన ఎవ్వరికైనా సరే లేదు , కాదు అనకుండా పెట్టి పంపించేవారట . అదే క్వాలిటీ బాలయ్య కి వచ్చింది. బాలయ్య నుంచి మోక్షజ్ఞకు వచ్చింది . ఎన్టీఆర్ లో కూడా అదే క్వాలిటీస్ ఉన్నాయి. అలా తారక్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు..!!