కోహ్లీ కంటే ముందే అనుష్క శర్మ ఆ స్టార్ క్రికెటర్ ను ప్రేమించిందా… అన్నీ తెలిసి విరాట్ ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసా.. రియల్ మగాడు..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మనందరికీ సుపరిచితమే. ఈమె ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరికి 2021లో వామిక అనే ఒక పాప కూడా జన్మించింది. ఇకపోతే తాజాగా ఆమె మరో సారీ గర్భం దాల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు అనుష్క శర్మ స్పందించనే లేదు. కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా స్పందించబోతుంది అంటూ కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి క్రమంలోనే కోహ్లీ అనుష్కకి సంబంధించిన.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అనుష్క విరాట్ కోహ్లీ కంటే ముందే.. విరాట్ కోహ్లీ ఫ్రెండ్ అయినా స్టార్ క్రికెటర్ ను ప్రేమించిందట. అతడు మరెవరో కాదు సురేష్ రైనా. ఓ ప్రైవేట్ పార్టీలో భాగంగా సురేష్ రైనాను కలిసిన ఆమెకు అతనితో మంచి పరిచయం ఏర్పడిందట. అలా కొద్ది కాలానికి రణబీర్ కపూర్ తో అనుష్క ఓ సినిమాలో నటించే సమయంలో వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త చూసి రైనా కు కోపం వచ్చిందట.

దీంతో రణబీర్ గురించి అడగగా.. అనుష్క రైనా పై ఫైర్ అయిందట. దీంతో కోపం వచ్చిన అనుష్క అతగాడితో రిలేషన్ షిప్ ను బ్రేకప్ చేసుకుందట. రేపో మాపో పెళ్లి చేసుకుంటారు.. అని ఫ్యాన్స్ ఆనందించే లోపే ఈ జంట విడిపోయింది. ఈ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేటర్ లో విరాట్ కోహ్లీ బకరా అయ్యాడు అంటూ.. పలువురు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే విరాట్ కోహ్లీకి వీరిద్దరి ప్రేమాయణం ముందే తెలుసు. కానీ అనుష్క పై ఉన్న నమ్మకం తో.. ఆమెపై నిజమైన ప్రేమ కలగడంతోనే కోహ్లీ ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి.. ఏడడుగులు నడిచాడు. ఇప్పటికీ ఆమె చెయ్యి వదలకుండా ఆమెతోనే ఉన్నాడు. ప్రేమకు ఇది సరైన నిర్వచనం అంటూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆయనను ఒక రేంజ్ లో పొగిడేస్తున్నారు.