త‌గ్గేదే లే అంటున్న కిర్రాక్‌ ఆర్పీ.. ఆ స్టార్ హీరోయిన్ తో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొత్త బ్రాంచ్‌!

ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపుల‌ర్ అయిన కిర్రాక్‌ ఆర్పీ.. కొద్ది నెల‌ల క్రితం బిజినెస్ స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. `నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు` పేరుతో క‌ర్రీ పాయింట్ ను ప్రారంభించి సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. నెల్లూరు నుంచి ప్రత్యేకంగా చేపలను తెప్పించి ఇక్కడ ర‌క‌ర‌కాల పులుసులు తయారు చేయించి విక్రయిస్తున్నాడు. మొద‌ట కూకట్‌పల్లిలో ఫ‌స్ట్ బ్రాంచ్ ఓపెన్ చేయ‌గా జ‌నాల నుంచి ఊహించ‌ని రెస్పాన్స్ వ‌చ్చింది.

త‌క్కువ స‌మ‌యంలో కిర్రాక్ ఆర్పీ బిజినెస్ య‌మా పాపుల‌ర్ అయింది. సినీ తార‌లు కూడా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులు రుచి చూడ‌టానికి మ‌క్కువ చూపారు. దీంతో మణికొండ, అమీర్‌ పేట కొత్త బ్రాంచ్‌లు ఓపెన్‌ చేశాడు. అలాగే ఇటీవ‌ల అనంతపురంలోనూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొత్త బ్రాంచ్‌ని ఓపెన్ అయింది.

అన్ని చోట్లు కిర్రాక్‌ ఆర్పీ చెప‌ల పులుసు బిజినెస్ సూప‌ర్ గా క్లిక్ అవుతోంది. దీంతో ఇప్పుడు మ‌రో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తిరుపతిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొత్త బ్రాంచ్ ప్రారంభం కాబోతోంది. అందుకు కిర్రాక్ ఆర్పీ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ మెహ్రీన్ తో ఈ కొత్త బ్రాంచ్ ను ఓపెన్ చేయించ‌బోతున్నాడు. ముహూర్తం కూడా పెట్టేశారు. నవంబర్‌ 19న ఉదయం పదిగంటలకు తిరుప‌తిలో మెహ్రీన్ చేతుల మీద‌ట న్యూ బ్రాంచ్ స్టార్ట్ కానుంది.