మెగాస్టార్ తో బోయపాటి పాన్ ఇండియా మూవీ.. సక్సెస్ అయ్యేనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట తో సోషియో ఫాంటసీ సినిమాని చేయడానికి సిద్ధమవుతున్నారు.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ని సైతం రిలీజ్ చేయడం జరిగింది. పంచభూతాలను ఏకం చేస్తూ ఒక కాలచక్రాన్ని సైతం పోస్టర్లు చూపించి మంచి ఇంట్రెస్టింగ్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా అయిపోయిన వెంటనే సోగ్గాడే చిన్నినాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో ముందుగా ఏ సినిమాని పట్టా లెక్కిస్తారో తెలియదు..కానీ తాజాగా చిరంజీవికి సంబంధించిన ఒక కొత్త సినిమా అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చిరంజీవి తన నెక్స్ట్ సినిమాతో బోయపాటి శ్రీను తో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు సంబంధించి బోయపాటి శ్రీను చిరంజీవికి ఒక లైన్ వినిపించాడట. అది బాగా నచ్చడం సిద్ధం చేయమన్నట్లు సమాచారం. ఒకవేళ చిరంజీవికి కథ నచ్చితే ఈ సినిమా తలకెక్కించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవలే బోయపాటి శ్రీను రామ్ కాంబినేషన్లో వచ్చిన స్కంద సినిమా ఫ్లాప్ కావడంతో మెగా అభిమానులు కాస్త ఆందోళన గురవుతున్నట్లు తెలుస్తోంది.స్కంద సినిమా రిసల్ట్ చూశాక కూడా చిరంజీవి ఈయనతో సినిమా తీస్తారా అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. అయితే తెలుగులో హిట్ లేని మెహర్ రమేష్ కే అవకాశం ఇచ్చినప్పుడు కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను చేసిన బోయపాటి సినిమాకు అవకాశం ఇవ్వడానికి పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై అధికారికంగా ఎవరు స్పందిస్తారో చూడాలి.