” బిగ్ బాస్ 7 ” కంటిస్టెంట్ గౌతమ్ హీరోగా ఎంట్రీ… ఏ సినిమా అంటే..!

సెవెన్ హిల్స్ నిర్మాణ సంస్థలో ” బిగ్ బాస్ 7 ” ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా ఓ సినిమా తీస్తున్నారు. శ్వేతా అవాస్తి, రమ్మ పసుపులేటి హీరోయిన్స్. నవీన్ కుమార్ దర్శకుడు. సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. గతంలో ” బట్టల రామస్వామి బయోపిక్కు ” సినిమాని నిర్మించి విమర్శకుల ప్రశ్నలు అందుకున్నారు. ఆర్పీ పట్నాయక్ తో ” కాఫీ విత్ ఏ కిల్లర్ ” మూవీ చేశారు.

ఇది సంతోష్ కుమార్ నిర్మిస్తున్న మూడో సినిమా. గౌతమ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే మూడు షెడ్యూల్లో పూర్తి చేసుకుంది. నిర్మాత సెవెన్ హిల్స్ సంతోష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ” గతంలో నేను నిర్మించిన రెండు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ” అకాశవీధుల్లో ” సినిమాతో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు బిగ్ బాస్ 7 షో తో మరింత పాపులర్ అయిన గౌతమ్ కృష్ణతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది.

గౌతమ్ బిగ్ బాస్ నుంచి తిరిగి రాగానే చివరి షెడ్యూల్ పూర్తి చేస్తాం. సాధారణ మధ్యతరగతి వ్యక్తి.. స్టూడెంట్ నుంచి కార్పోరేట్ స్థాయికి ఎలా ఎదిగాడు అనే పాయింట్ తో తీస్తున్న సినిమా ఇది. త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయడంతో పాటు మూవీ విడుదల తేదీని ప్రకటిస్తాం ” అంటూ నిర్మాత సతీశ్ చెప్పారు.