రెండో పెళ్లికి అమ‌లా పాల్ గ్రీన్ సిగ్న‌ల్‌.. కాబోయే వాడిని ముద్దుల‌తో ముంచేసిన హీరోయిన్‌!(వీడియో)

అమ‌లా పాల్‌.. సౌత్ సినీ ప్రియుల‌కు ఈ డ‌స్కీ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేర‌ళ‌లో జ‌న్మించిన అమ‌లా పాల్‌.. ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేసింది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ అందాల భామ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి వార్త‌ల్లో నిలిచింది. గ‌తంలో అమ‌లా పాల్ దర్శకుడు AL విజయ్‌తో ప్రేమలో పడింది.

2014లో కుటుంబ స‌భ్యుల అంగీకారంతో విజ‌య్ ను అమ‌లా పాల్ వివాహం చేసుకుంది. అయితే వీరి బంధం ఎక్కువ కాలం కొన‌సాగ‌లేదు. వ్య‌క్తిగ‌త విభేదాల‌తో విజ‌య్‌, అమ‌లా పాల్ 2017లో విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి ఒంట‌రిగానే ఉంటున్న అమ‌లా పాల్‌.. ఇప్పుడు మ‌ళ్లీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది. అమ‌లా పాల్ ప్రియుడి పేరు జగత్ దేశాయ్. గ‌త కొద్ది రోజుల నుంచి వీరిద్ద‌రూ ల‌వ్ లో ఉన్నారు. నేడు అమ‌లా బ‌ర్త్‌డే కావ‌డంతో.. ఒక పబ్బులో జగత్ దేశాయ్ పార్టీ ఏర్పాటు చేశాడు.

ఈ పార్టీలో డ్యాన్స్ చేస్తూ అమ‌లా పాల్‌ ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచారు. అందుకు అమలా పాల్ హ్యాపీగా ఎస్ చెప్పేసింది. అంతేకాదు కాబోయే వాడిని ముద్దుల‌తో ముంచేసింది. ఇందుకు సంబంధించిన‌ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు జగత్ దేశాయ్.. `నా రాణి ఎస్ చెప్పింది. పెళ్లి గంటలు మోగుతున్నాయి. హ్యాపీ బర్త్ డే మై లవ్` అంటూ అమలా పాల్ ను ట్యాగ్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. నెటిజ‌న్లు, అభిమానులు.. అమ‌లా పాల్‌-జ‌గ‌త్ దేశాయ్ కు విషెస్ తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jagat Desai (@j_desaii)