వైసిపి, జనసేన మధ్యలో బోల్డ్ బ్యూటీ అనసూయ… అసలు రహస్యం ఇదే…!!

తాజాగా కృష్ణా జిల్లా పోరంకిలో పవర్ స్టార్ అభిమానులు చేసిన సందడి మనకి తెలిసిందే. వంగవీటి రాధా వివాహానికి హాజరైన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు జనం ఎగబడడంతో వారిని ఆపడం ఎవరివల్ల కాలేదు. ఆ తోపులాటలో మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చిక్కుకుపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైయస్ జగన్ వచ్చినా ప్రజలు ఇదే స్థాయిలో ఎగబడతారని, తాము ఎందులోను తీసిపోలేదంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

మరొక నెటిజన్ అయితే ” అనసూయ, రష్మీ ఎక్కడికి వచ్చిన జనం ఇలాగే ఎగబడతారు ” అంటూ చేసిన ట్వీట్ ని అనసూయ చూశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే ఇలా వ్యాఖ్యానించడాన్ని అనసూయ తప్పుబట్టింది. ” మాకు సంబంధంలేని వేడుకలో మా పేర్లు తీసుకురావడం ఒక తప్పు అయితే.. మా పేర్లను ప్రస్తావించి మాట్లాడడం ఇంకో తప్పు ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చానని.. తన ప్రయాణాన్ని తక్కువ చేసి చూడకుండా గౌరవిస్తే బాగుంటుందని పేర్కొంది.

ఈ విషయంలో తన పేరు ఉపయోగించడం తప్పని, జీవితంలో ఏదో సాధించిన వారు ఎలా ఉంటారో చూద్దామని ఉద్దేశంతో జనం వస్తారని, మా పేర్లు వాడినంత మాత్రాన ఎవరూ సులువుగా ఈ స్థాయికి రాలేరని, ఈ విషయాన్ని అందరూ గుర్తిస్తే మంచిదని ” రిప్లై ఇచ్చింది. ప్ర‌స్తుతం అన‌సూయ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.