వామ్మో.. ఏంటి.. మన నవ్వుల బ్రహ్మానందంకి ఆ సినిమా అంటే అంత ఇష్టమా..?

నవ్వుల బ్రహ్మ బ్రహ్మానందం కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వందలాది సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న బ్రహ్మానందం తన సినీ కెరీర్‌లో స్టార్ కమెడియన్‌గా తిరుగులేని ముద్ర వేసుకున్నాడు. తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్రహ్మానందం ఆస్తులను కూడా బాగా సంపాదించాడు. ఇటీవల బ్రహ్మానందం చిన్న కొడుకు వివాహం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ ప్రముఖులంతా కూడా ఈ ఈవెంట్ లో హాజరయ్యారు. ఇక కొన్ని దశాబ్దాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న బ్రహ్మానందం ఇప్పటికీ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటిస్తూనే ఉన్నాడు. టాలీవుడ్ టాప్ కమెడియన్ ఎవరు అంటే ప్రేక్షకులకు టక్కున గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం పేరే. ఇక ఇటీవల బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా మీ ఫేవరెట్ మూవీ ఏంటి అని ప్రశ్న ఎదురు కాగా.. బ్రహ్మానందం మాట్లాడుతూ.. విజ‌య్ దేవరకొండ, రీతు వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన పెళ్లిచూపులు సినిమా అంటే చాలా ఇష్టమని చుప్పాడు.

బ్ర‌హ్మి మాట్లాడుతూ ఈ మూవీలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మేకింగ్ చాలా బాగుంటుందని అలాగే కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా పండించారని.. నా ఫేవరెట్ మూవీస్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఈ పెళ్లి చూపులు మూవీ అంటూ బ్రహ్మానందం వివరించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. బ్రహ్మానందంకు కూడా మా రౌడీ హీరో మూవీ అంటేనే ఇష్టమా అంటూ.. దట్ ఇజ్‌ విజయ్ దేవరకొండ అంటూ.. విజయ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.