వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్- లావణ్య వివాహ పత్రిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగబాబు కుమారుడిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది.. అయితే ఈ పెళ్లికి మెగా కుటుంబంలో హీరోలు సైతం లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా గత కొద్దిరోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఇందులో భాగంగా వరుణ్ తేజ్, లావణ్య తమకు ఇష్టమైన దేశం ఇటలీలో వివాహం చేసుకుంటారని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. వీటిని నిజం చేస్తూ.. ఇటలీలోని టస్కానీలో ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి కూడా చాలా కొద్ది మంది సమక్షంలో నవంబర్ ఒకటవ తేదీన వివాహ బంధంతో ఒకటి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జంట నవంబర్ 1వ తేదీన పెళ్లి చేసుకుంటూ ఉండగా వీరికి సంబంధించిన ఒక పెళ్లి కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.

సిల్వర్ కలర్ లో ఉన్న కార్డులో మొదట వరుణ్ తేజ్ తాత నానమ్మల పేర్లను పెట్టారు.. ఆ తరువాత వరుణ్ పెదనాన్న చిరంజీవి పేరు బాబాయి పవన్ కళ్యాణ్ పేరు చివరిగా వాళ్ళ అన్నయ్య రాంచరణ్ పేరు ముద్రించడం జరిగింది. ఈ పేర్లతో పాటు వరుణ్ తల్లిదండ్రుల పేర్లు కూడా అలాగే లావణ్య తల్లితండ్రుల పేర్లు కూడా ముద్రించారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు మాత్రం వైరల్ గా మారుతోంది. ఇక పెళ్లి కోసం ఇప్పటికే వీరిద్దరూ ఇటలీకి బయలుదేరడం జరిగింది. తన ఇంస్టాగ్రామ్ ద్వారా వరుణ్ ఈ విషయాన్ని తెలిపారు.