అన్ని డేట్స్ ఉండగా..దేవర సినిమాను ఏప్రిల్ 5నే ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..? కొరటాల స్ట్రాటజీ ఇదే..!!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అందరి కళ్లు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా పైనే ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ ఎంతో ఇష్టంగా కసిగా.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా హిట్ అవ్వడం కొరటాలకు ఎంత ఇంపార్టెంటో ఎన్టీఆర్ కి అంతే ఇంపార్టెంట్. అందుకే ఈ సినిమా కోసం ఇద్దరు బాగా కష్టపడుతున్నారు ఏ విషయాన్ని సైతం తేలికగా తీసుకోవడం లేదు .

సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి విషయాన్ని అంతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అందుకే రిలీజ్ డేట్ ని కూడా చాలా పకడ్బందీగా ఏప్రిల్ 5న ముందే ఫిక్స్ చేసుకున్నారు. నిజానికి జనవరిలోని ఈ సినిమాని రిలీజ్ చేయొచ్చు కానీ అప్పుడు సినిమాలు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది . ఫిబ్రవరి మార్చ్ లో డేట్స్ ఉన్నా కానీ ఎందుకు కొరటాల ఏప్రిల్ లోనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఏప్రిల్ 5 శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అవుతుంది .

6, 7 శని ఆదివారం కావడంతో సినిమాకి బాగా కలిసొస్తుంది . ఆ తర్వాత ఉగాది పండుగ ఎలాగో హాలిడే. ఆ తర్వాత పదవ తేదీ ఈద్.. అది కూడా హాలిడే. ఆ తర్వాత 13 , 14 సెకండ్ వీకెండ్ 2 సెలవులే .. అంతేకాదు ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి పండుగ అది కూడా హాలిడే .. ఇలా ఇన్ని వరుసగా హాలిడేస్ బ్యాక్ టు బ్యాక్ వస్తుంది .. ఏ సినిమా అయినా సరే అప్పుడు రిలీజ్ అయితే కచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది.. అదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు కొరటాల ..అందుకే ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చేయాలని పక్కాగా ఫిక్స్ అయిపోయాడు..!!