ఆమె లేనిదే మహేష్ బాబు ఏమీ చేయలేరా.. ఏమైందంటే..?

చాలామంది ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాలను కొందరు హీరోలు చేయటం సహజం. కానీ మహేష్ బాబు మాత్రం డబ్బింగ్ సినిమాలకు విరుద్ధం. ఈయన తన తండ్రి ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మహేష్ బాబు. మహేష్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన చాలా సినిమాలు తీసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. అందుకేనేమో ఆయన ఈరోజు టాప్ హీరో పొజిషన్లో నిలిచాడు.

Mahesh Babu hugs wife Namrata Shirodkar in adorable photos from couple's  Switzerland holiday - India Today

నిజానికి చెప్పాలంటే ఈయన తీసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో హిట్గానే నిలిచాయి. అలాంటి మహేష్ బాబుకి కొన్ని విషయాలు అంటే అసలు నచ్చవు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొన్నటికి మొన్న ఆయనకి రీమిక్స్ సినిమాలు అంటే ఇష్టం లేదని తెలియజేశారు.. ఎందుకంటే ఒక హీరో ఆల్రెడీ చేసిన సినిమాని మళ్లీ మనం ఇక్కడ చేయటం అనేది ఆయనకి నచ్చని విషయం..ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ సినిమాని చూసి ఉంటాం కాబట్టి మనం ఎంతలా ఆ సీన్ ని కొత్తగా చేయాలనుకున్నా కూడా ఆ ముందు ఎవరైతే ఆర్టిస్ట్ ఆ సినిమా చేశాడో ఆయన తాలూకు కొంత రిఫరెన్స్ అనేది మనకు తెలియకుండానే మన సినిమా మీద పడుతుందట. కాబట్టి మహేష్ బాబు కి రీమిక్స్ సినిమాలు చేయటం అసలు నచ్చదట.

ఈ విషయం కాస్త పక్కన పెడితే..ఆయనకి హర్రర్ మూవీస్ అన్నా కూడా నచ్చదట. సరదా కోసం చూస్తారు కానీ ఆ సినిమాలను చూడటం ఆయనకి అసలు నచ్చదట. మహేష్ చేసిన సినిమా చూసినప్పుడు ఆయనకి ఏదైనా లోపం కనిపిస్తే తన భార్య అయిన నమ్రుతాకి ముందే చెప్పేసి తను కూడా ఒప్పుకుంటే. ఆ సన్నివేశాలను సవరించుకుంటాడట. ఈ విషయం తెలిసి పలువురు నేటిజన్స్ నమ్రత లేనిది మహేష్ బాబు లేడంటూ కామెంట్స్ చేస్తున్నారు.