`స్కంద‌` మూవీకి సాలిడ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే రామ్ టార్గెట్ ఎంతో తెలుసా?

ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `స్కంద‌`. ఇందులో శ్రీ‌లీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టిస్తే.. శ్రీ‌కాంత్‌, ప్రిన్స్ సిసిల్, గౌతమి, ఇంద్ర‌జ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు పాన్ ఇండియా స్థాయిలో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది.

ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన రెండు ట్రైల‌ర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాడు. ప్ర‌మోష‌న్స్ తో చిత్ర టీమ్ మ‌రింత హైప్ పెంచ‌డంతో.. బుక్కింగ్స్ అద్భుతంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు స్కంద‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సాలిడ్ గా జ‌రిగింది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను రూ. 41 కోట్ల‌కు కొనుగోలు చేశారు.

అలాగే ఓవ‌ర్సీస్ లో రూ. 2.2 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగింది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా స్కంద థియేట్రిక‌ల్ రైట్స్ రూ. 46.20 కోట్లకు అమ్ముడుపోయాయి. ఫైన‌ల్ గా స్కంద బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 47 కోట్లు. రామ్ ఈ సినిమాతో హిట్ కొట్టి మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాలంటే బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 47 కోట్ల రేంజ్ లో షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. మ‌రి ఈ టార్గెట్ ను రామ్ అందుకుంటాడా.. లేదా.. అన్న‌ది తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. కాగా, ఏరియాల వారీగా స్కంద ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇలా ఉన్నాయి..

నైజాం: 13 కోట్లు
సీడెడ్: 8.50 కోట్లు
ఆంధ్రా: 19.50 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ‌= 41.00 కోట్లు
—————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్‌: 3 కోట్లు
ఓవర్సీస్‌: 2.20 కోట్లు
—————————-
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌= 46.20 కోట్లు(బ్రేక్ ఈవెన్ – 47కోట్లు)
—————————-