సమంతకు షాక్ ఇచ్చిన ర‌ష్మిక‌.. ఎంత ప‌ని చేసిందో చూడండి..!

ప్రజెంట్ ” పుష్ప 2 , యానిమల్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న రష్మిక… మరో రెండు, మూడు సినిమాలు లైన్ లో పెట్టింది. ఇక ఇప్పటికే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ” రెయిన్ బో ” కు సైన్ చేసిన ఈ ముద్దుగుమ్మ… తాజాగా రాహుల్ రవిచంద్రన్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఈ రెండు సినిమాలు కూడా ముందుగా సమంత ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అని టాక్. కానీ సమంత అనారోగ్యం కారణంగా ఆమె బ్రేక్ తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని ఆ అవకాశాలు కాస్త రష్మిక దక్కించుకుంది. ఒకవేళ ఈ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయితే… రష్మిక క్రేజ్ మరో లెవెల్ కి చేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. అలాగే సమంత కూడా తాజాగా రిలీజ్ అయిన ” ఖుషి ” సినిమాతో హిట్ ని దక్కించుకుంది.