తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో శివ, క్షణం క్షణం అంటే ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన దగ్గర ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి దర్శకత్వంలో మెళుకువలు నేర్చుకొని ఇప్పుడు టాప్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్న విషయం తెలిసిందే.
ఇంతటి సక్సెస్ఫుల్ సినిమాలను అందించి మంచి పేరు దక్కించుకున్న రాంగోపాల్ వర్మ ఈమధ్య అన్ని అడల్ట్ సినిమాలు చేస్తూ మరొకవైపు రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే . ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్మాయిల పైన ఫోకస్ చేస్తున్న రాంగోపాల్ వర్మ ఇప్పటికే చాలామంది అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేసి.. వారి కంటూ ఒక గుర్తింపును అందించారు. అలాంటి వారిలో అషు రెడ్డి, అరియానా ఇలా కొంతమంది అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారిలోని అందాల కోణాలను బయటకు తీసి వారికంటూ ఒక గుర్తింపును అందించిన విషయం తెలిసిందే. అందుకే చాలామంది అమ్మాయిలు వర్మ కంట్లో పడాలని తమకి కూడా పాపులారిటీ లభించాలని తెగ ఆత్రుత పడుతూ ఉంటారు.
అయితే ఇప్పుడు తాజాగా వర్మ కంట్లో మరొక లేడీ పడిందని వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని సెలబ్రిటీ చేస్తారో ఎవరికీ తెలియదు .ఈ క్రమంలోనే తాజాగా ఒక అమ్మాయి గురించి ఆయన ప్రస్తావించారు. ఒక అమ్మాయి శారీ కట్టుకొని.. ఒక కెమెరా పట్టుకొని ఉండగా ఆమె వివరాలను అడిగారట వర్మ.. అలా అమ్మాయి గురించి అడగగా ఆ అమ్మాయి అసలు పేరు శ్రీ లక్ష్మీ సతీష్ అని.. తాను ఒక ఇన్స్టా మోడల్ అని వివరాలు తెలిపారు. కేరళకు చెందిన ఈ అమ్మాయి గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేశారు. ఇది చూసిన నెటిజన్లు శ్రీలక్ష్మి సతీష్ ను రాంగోపాల్ వర్మ ఏ సినిమాలో హీరోయిన్గా పెడతారు అని అందరూ ఎంక్వయిరీలు మొదలుపెట్టారు. ఇక వర్మ కంట్లో పడిన ఈ అమ్మాయి కచ్చితంగా సెలబ్రిటీ అవుతుందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Can someone tell me who she is ? pic.twitter.com/DGiPEigq2J
— Ram Gopal Varma (@RGVzoomin) September 27, 2023