స్కంద కోసం భారీగా బ‌రువు పెరిగిన‌ రామ్.. ఎన్ని కిలోలో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది!

ఉస్తాద్ రామ్ పోతినేని మరికొన్ని గంటల్లో `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. రామ్, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. భారీ అంచనాల నడుమ రేపు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాష‌ల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

అయితే మునుప‌టి సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో రామ్ చాలా కొత్తగా కనిపించాడు. సినిమా పోస్టర్లు, టీజర్, టైలర్స్ ను గమనిస్తే రామ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. లుక్స్ తో పాటు బాడీని కూడా పూర్తిగా మార్చాడు. ఇంతకుముందు సినిమాల్లో స్మార్ట్ గా కనిపించిన రామ్.. ఈ సినిమాలో కండలు తిరిగిన దేహంతో దర్శనమిచ్చాడు. స్కంద కోసం రామ్ బరువు పెరగడని క్లారిటీగా కనిపిస్తోంది. అయితే ఎన్ని కిలోల బ‌రువు పెరిగాడో తెలిస్తే కచ్చితంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది.

స్కంద కోసం రామ్ ఒకటి రెండు కాదు ఏకంగా 12 నుంచి 14 కిలోల బ‌రువు పెడగాడట. 70 కిలోలకు కొంచెం అటు ఇటుగా రామ్‌.. 84 కిలీల‌కు పెరిగాడు. ఇందుకోసం జిమ్ములో చాలా కష్టపడ్డాడట. తాజాగా జిమ్ లో దిగిన రామ్ ఫోటో ఒకటి నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ పిక్ చూసి నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. రామ్ డెడికేషన్ కు ఫిదా అవుతున్నారు. ఇక మ‌రి గ‌త చిత్రాలైన రెడ్‌, స్కంద‌తో నిరాశ‌ప‌రిచిన రామ్ పోతినేని.. స్కంద‌తో ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాడో తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.