ఎన్టీఆర్ తో 7 సినిమాలను వదులుకున్న స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు..RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్ ఈ సినిమాతో మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. దీంతో చాలామంది హీరోయిన్స్ సైతం ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తే చాలని కోరుకుంటున్నారు.. అలాంటి నటించే అవకాశం వచ్చినా.. వద్దని చెప్పేసిన ఒక స్టార్ హీరోయిన్ కూడా ఉన్నదట. అది కూడా ఏడుసార్లు వచ్చిన అవకాశాలను వదిలేసుకున్న హీరోయిన్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం

ఎన్టీఆర్ తో నటించే అవకాశం వచ్చిన వదులుకున్న హీరోయిన్ ఎవరో కాదు అనుష్క.. ఎన్టీఆర్ తో నటించే అవకాశాలన్నిటిని కూడా నో చెప్పిందట.. ఇప్పుడైతే ఎన్టీఆర్ ఫిజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నది కానీ నరసింహుడు, రాఖి ,నా అల్లుడు సినిమా సమయంలో ఎన్టీఆర్ చాలా లావుగా కనిపించేవారు. తన నటనతో డాన్స్లతో ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ సరసన హీరోయిన్స్ కొరత చాలానే ఉండేదట. అలాంటి సమయంలో దర్శకులు అనుష్కలను కలిసి కథ చెప్పగా ఎన్టీఆర్ హీరో అని చెప్పగానే నో చెప్పేదని ఒక టాక్ వినిపిస్తూ ఉండేది.

ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా బరువు తగ్గి పలు సినిమాలలో నటించారు అయినప్పటికీ వీరి కాంబినేషన్ సెట్ చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నించిన అవేవీ సెట్ కాలేదు. గతంలో కేవలం చింతకాయల రవి అనే సినిమాలోని పాటలు ఎన్టీఆర్ తో కలిసి అనుష్క రెండు నిమిషాల పాటు కనిపించింది ఆ తర్వాత వీరిద్దరి జోడిలో ఇంతవరకు ఏ సినిమా కూడా కనిపించలేదు. మరి రాబోయే రోజుల్లోనైనా వీరు కాంబినేషన్లు ఏదైనా చిత్రం వస్తుందేమో చూడాలి.