జూ.ఎన్టీఆర్ కు ఎప్పటికీ తీరని కోరిక ఒకటి ఉందట.. అదేంటో తెలుసా..?

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ మూవీ తర్వాత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా ‘ దేవర ‘ కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీ రూపొందుతుంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట.

జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ దాదాపు రూ. 100 కోట్లని తెలుస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి ఎన్ని కోట్లు ఉన్నా ఏం లాభం అంటూ ఎప్పుడు నిరాశ గానే ఉంటారట. ఎందుకంటే..? అతనికి ఇద్దరు కొడుకులు పుట్టారు. తారక్ ఆడపిల్ల మీద ఎంతో ఇష్టం ఉండటం. ప్రణతి మొదటిసారి డెలివరీ అయినప్పుడు అమ్మాయి పడుతుందని ఆశపడితే ఆ కోరిక నెరవేలేదు. అలాగే రెండోసారి కూడా కొడుకు పుట్టడంతో జూనియర్ ఎన్టీఆర్ డీల పడిపోయాడట. మూడోసారైనా అమ్మాయి పుడుతుందని భావించిన ఎన్టీఆర్.. భార్య లక్ష్మీ ప్రణతి మూడోసారి డెలివరీ అయితే ప్రాణాలకు మొప్పు అని చెప్పడంతో.. జూనియర్ ఎన్టీఆర్ ఆ కోరికను వదిలేశాడు.

ఇంట్లో కాళ్లకు పట్టాలు పెట్టుకుని తిరిగే ఆడపిల్ల ఉంటే.. లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతుంది ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి మంచి కుటుంబం ఇద్దరు కొడుకులు ఉన్న ఆడపిల్లలేని లోటు మాత్రం లోటే అంటూ తారక్ స్నేహితులతో చెప్తూ ఉంటాడట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ అన్నకు కూడా ఓ ఆడపిల్లను దేవుడు ఇచ్చి ఉంటే నిజంగానే బాగుండేదని కామెంట్స్ పెడుతున్నారు.