జూనియర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ ‘ దేవర ‘. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాతో ఎలాగైనా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి ఎంతో కసితో ప్రయత్నిస్తున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని అందరికీ తెలుసు. సముద్రం మాఫియాతో ఈ సినిమాలో హోరాహోరీ సన్నివేశాలు జరుగుతాయట.
అయితే ఇందులో భాగంగానే నిజమైన బీచ్ తలపించేలా హైదరాబాద్ లో బీచ్ సెట్ ను ఏర్పాటు చేశాడు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్. అయితే ఈ సెట్ లో ఎన్టీఆర్ కొన్ని ఫైట్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా నటించబోతున్నాడని న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో జాన్వి రోల్ చాలా మేజర్ అట్రాక్షన్ గా ఉండబోతుంది అదేవిధంగా బీ టౌన్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో నటించబోతున్నాడు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ , యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను ఎంతో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకి రాబోతుంది.