యానిమల్ సినిమా కోసం భారీ డిమాండ్ చేస్తున్న రష్మిక.. ఎన్ని కోట్లంటే..?

ప్రముఖ శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకొని పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్న ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే మిషన్ మజ్ను, గుడ్ బై వంటి చిత్రాలలో నటించిన రష్మిక ఈ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఇక ఇప్పుడు తన ఆశలన్నీ యానిమల్ చిత్రంపైనే పెట్టుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Animal: Rashmika Mandanna In Talks For A Special Song In Ranbir Kapoor  Starrer?

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రణబీర్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. మరొకవైపు రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అందరిని ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. మెడలో తాళిబొట్టు.. పట్టుచీరలో మరాఠీ గృహిణిగా ఆమె ఆకట్టుకుంది. డిసెంబర్ ఒకటవ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే చిత్ర బృందం షూటింగ్ శరవేగంగా జరుపుతున్న విషయం తెలిసిందే .ఇక సినీ ప్రియులంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై పాజిటివ్ బజ్ పెరిగిపోతుందని చెప్పవచ్చు .

 

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించిన నటీనటుల పారితోషకం మరింత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. రణబీర్ కపూర్ ఈ చిత్రంలో నటించడానికి ఏకంగా రూ. 70 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రష్మిక విషయానికి వస్తే ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.4కోట్ల పారితోషకం తీసుకుందని తెలుస్తోంది. ఎందుకంటే దక్షిణాదిలో అత్యధిక పారితోషకం తీసుకునే నటీమణులలో ఒకరిగా చలామణి అవుతున్న ఈమె ఈ సినిమా కోసం ఈ రేంజ్ లో తీసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ ఒకటో తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా రష్మిక కెరీర్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.