పరిణీతి చోప్రా ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన పరిణీతి చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటనతో , అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈమె సినీ ఇండస్ట్రీలో నటిగా మంచి సక్సెస్ చవిచూసింది. ఇక తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ఘనంగా ఉదయపూర్ లీలా ప్యాలెస్ లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే . ఇకపోతే వీరి వివాహం తర్వాత పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Parineeti Chopra-Raghav Chadha wedding LIVE updates: 1st pic as  husband-wife out - India Today

ఇక వీరి ఫోటోలు చూసిన చాలామంది నటిజన్స్ పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఇన్ని రోజులు హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగిన ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాదు ప్రస్తుతం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి కోడలిగా వెళ్లడంతో అందరూ ఈమె ఆస్తుల గురించి తెలుసుకోవడానికి తన ఆరాటపడుతున్నారు. వాస్తవానికి వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పరిణితి చోప్రా నికర ఆస్తుల విలువ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

 

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగడమే కాదు ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న ఈమె సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇటీవల రూ.22 కోట్ల ఖరీదు చేసే ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.. ఇక ఈమె వద్ద ఖరీదైన కార్లు కూడా ఉన్నాయట. వాటి విలువ కోట్లలోనే ఉంటుందని సమాచారం. మొత్తానికి అయితే పలు బ్రాండ్ ల ద్వారా, సినిమాల ద్వారా ప్రమోషన్స్ ద్వారా రూ.100 కోట్లకు పైగా కూడబెట్టినట్లు సమాచారం.