రివ్యూ:షారుక్ జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా..?

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ,డైరెక్టర్ అట్లీ ,నయనతార హీరోయిన్గా వచ్చిన చిత్రం జవాన్.. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలు దీపికా పదుకొనే నటించడం జరిగింది. అలాగే కమెడియన్ యోగి బాబు కూడా తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. మరి నేటిజెన్ల అభిప్రాయం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Shahrukh Khan charged such a huge amount for Jawan! Nayanthara's fee is  very less than Vijay Sethupathi - Bollywood Wallah

షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా రూ.500 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టి మంచి విజయాన్ని అందుకోవడంతో జవాన్ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు యాక్షన్ సస్పెన్స్ అంశాలతో పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా డైరెక్టర్ అట్లీ తెలకెక్కించారు. తెలుగు రాష్ట్రాలలో కూడా బిజినెస్ భారీగా జరగడంతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరిగింది.

Jawan song Chaleya: Shah Rukh Khan flaunts his cool moves, Nayanthara looks  like a million bucks in teaser | PINKVILLA

జవాన్ చిత్రంలో షారుక్ ఖాన్ వన్ మ్యాన్ షో గా డిఫరెంట్ రోల్స్ లో పలు రకాల గెటప్పులలో అదరగొట్టేసారని తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్ లో వేరియేషన్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయని పలువురు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. నయనతార పాత్రకు కూడా మంచి మార్కు ఉందని కేవలం గ్లామర్కి పరిమితం కాకుండా కథలో కీలకంగా చేశారని తెలియజేస్తున్నారు. ప్రియమణి అదనపు ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా దీపికా పదుకొనే గెస్ట్ రోల్ లో అదరగొట్టేసిందని తెలుపుతున్నారు. విజయ్ సేతుపతి కూడా షారుక్ ఖాన్ తో పోటీపడి మరి నటించారని తెలుపుతున్నారు.

పలువురు నెటిజన్స్ తెలుపుతున్న ప్రకారం జవాన్ మూవీ సూపర్ గా ఉందని స్క్రీన్ మీద షారుఖ్ ఖాన్ నటన విస్ఫోటనంగా సృష్టించారని కథ కూడా చాలా అద్భుతంగా ఉందని షారుక్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ ఒక నెటిజన్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

జవాన్ మూవీ అవుట్ అండ్ డౌట్ అండ్ బిలీవర్ మూవీ బాలీవుడ్ తెరమీద ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు చూడలేదంటూ మరొక నేటిజన్ కామెంట్స్ చేస్తున్నారు.