మిస్ శెట్టి -మిస్టర్ పోలిశెట్టి రివ్యూ.. అనుష్కకు కలిసొచ్చేనా..!!

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు ఐదు భాషలలో రావడం జరిగింది.. ఇప్పటికే ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది.. ఈ సినిమా చూసిన ఆడియన్స్ సైతం ఏ విధంగా మెప్పించింది తెలుసుకుందాం.

Miss Shetty Mr Polishetty (2023) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

అనుష్క, నవీన్ కాంబినేషన్ సన్నివేశాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయని నవీన్ పోలిశెట్టి స్టాండ్ ఆఫ్ కమెడియన్ గా బాగా ప్లస్ అయిందంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత స్క్రీన్ ముందుకు వచ్చిన అనుష్క శెట్టి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ పలువురు సైతం కామెంట్స్ చేస్తున్నారు.. సినిమాలో తన పాత్రలో ఆమె జీవించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనుష్క అభిమానుల సైతం ఆమె పైన ఉన్న ప్రేమను ఫలితం ఇలాంటివి ట్విట్టర్ రూపంలో కామెంట్లు చేస్తున్నారు. కామెడీ టైమింగ్ పరంగా ఏమాత్రం తేడా లేకుండా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే విధంగా ఈ సినిమా ఉన్నట్టు తెలుస్తోంది.

మరో ట్విట్టర్ కామెంట్స్ చూసుకుంటే ఈ సినిమా మొదటి భాగం బాగుందని సెకండ్ హాఫ్ అయితే మరింత అద్భుతంగా ఉందంటూ సూపర్ హిట్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు..అనుష్క తన పాత్రలో జీవించేసిందంటూ ఇది పక్కా హీట్ బొమ్మ అంటూ తెలుపుతున్నారు. ఈ సినిమా టెక్నీషియల్ టీం పైన కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ అద్భుతంగా ఉందంటూ ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ప్లస్ అయింది అంటూ తెలుపుతున్నారు.

ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద ఆధారపడి ఉందంటూ తెలుపుతున్నారు. పూర్తిగా ఈ సినిమాతో అనుష్క కం బ్యాక్ ఇచ్చినట్టే అంటూ కామెంట్స్ చేయడం జరుగుతోంది.