ఎన్టీఆర్ చేయాల్సిన ఖైదీ నెంబర్ 150.. చిరు చేయడం వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

టాలీవుడ్ లో చిరంజీవికి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది హృదయాలో చెరగని ముద్ర వేసుకున్న చిరంజీవి దాదాపు నాలుగు దశబ్దాలుగా నిరంతరాయంగా స్టార్ హీరోగా కొనసాగాడు. ఫుల్ ఫామ్ లో ఉన్న టైంలోనే చిరంజీవి సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఈ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

తమిళ్ కత్తి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా రిలీజై రూ.100 కోట్లకు పైగా భారీ షేర్లతో కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే అలాంటి ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఎన్టీఆర్ నటించాల్సి ఉందని దర్శకుడు గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. తను ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని కోలీవుడ్ మూవీ కత్తిని తెలుగులో ఎన్టీఆర్ హీరోగా రీమేక్ చేయాలని నేను అనుకున్నాను అని ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపించారని చెప్పుకొచ్చాడు.

కానీ విజయ్ ముందుగా ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలనుకోవడం ఇందులో చిరంజీవిని హీరోగా ఎంచుకోవడం లాంటి కారణాలతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని వివరించాడు. అయితే ఈ సినిమా ఆగిపోయిన తర్వాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో మూవీ చేయడానికి ఎన్టీఆర్‌కి ఒక కథ వినిపించానని దీంతో ఎన్టీఆర్ వైలెన్స్ ఎక్కువైందని తెలియజేశారు.. ఇదే కాదు 2016 – 17 టైంలో ఎన్టీఆర్ గోపీచంద్ కాంబోలో మరో ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందని అత‌డు చెప్పుకొచ్చాడు. ఇక భవిష్యత్తులో అయినా వీరి కాంబోలో సినిమా వస్తుందో..? లేదో..? చూడాలి.