పరిణితి చోప్రా-రాఘవన్ చద్దా పెళ్లి డేట్ ఫిక్స్.. వైరల్ గా మారిన వివాహ పత్రిక..!!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రణీత చోప్రా, ఢిల్లీ ఎంపీ రాఘవ్ చద్దాల వివాహానికి అంతా సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. వీరి వివాహ ముహూర్తాన్ని కూడా తాజాగా కుటుంబ సభ్యులు ఖరారు చేసినట్లుగా తెలుస్తున్నది. ఈనెల 25న రాజస్థాన్లో ఉదయపూర్ లో వీరి వివాహం జరగబోతున్నదనే వార్తలైతే వినిపించాయి..పెళ్లి ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అతిధుల కోసం ఈ జంట స్వయంగా పలు ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పలు రకాల హోటల్స్లో లగ్జరీ రూమ్స్ కూడా బుక్ చేసినట్లు సమాచారం.

Parineeti Chopra and Raghav Chadha's wedding invitation goes viral online;  couple to host grand reception in Chandigarh | Hindi Movie News - Times of  India

ఈనెల 17వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయని.. వీరి సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అలాగె సెప్టెంబర్ 30వ తేదీన చండీగఢ్లో తాజ్ హోటల్లో స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య విందు ఇవ్వబోతున్నట్లు సమాచారం.అలాగే ఈనెల 23, 24వ తేదీలలో రాజస్థాన్లోని లీలా ప్యానెల్ లో ఉదయ విలాస్ లో కార్యక్రమాల కోసం పలు రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట.. పరిణితి చోప్రా రాఘవన్ చద్ద వివాహ రిసెప్షన్ కు ఆహ్వానం పలుకుతూ పోస్ట్ చేసిన ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఈనెల 23న వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.. ఇక భారీ అతిథులు వస్తున్న నేపథ్యంలో ఉదయపూర్ పోలీసులు కూడా వీరి పెళ్లికి భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి సీఎం క్రేజీ వాల్ తో సహా పలు వీఐపీలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరిణితి, రాఘవుల ఎంగేజ్మెంట్ మే 13న చాలా ఘనంగా జరిగింది. ప్రస్తుత వీరి పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కార్డ్ వైరల్ గా మారుతోంది.