వివాహం చేసుకున్న బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో కమెడియన్ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు మహేష్ విట్టా.. మొదట యూట్యూబ్ లో ఫన్ బకెట్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈయన ఆ తర్వాత పలు సినిమాలలో బుల్లితెర పైన కనిపించే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ -3 లో పాల్గొని ప్రేక్షకులకు చేరువైన మహేష్ విట్టా ఆంధ్రప్రదేశ్లోని వైయస్సార్ కడప జిల్లా పొద్దుటూరు ప్రాంతంలో జన్మించారు. ఈయన ఎక్కువగా రాయలసీమ యాసలోనే మాట్లాడుతూ ఉంటారు.

తాజాగా మహేష్ తను ప్రేమించిన శ్రావణి రెడ్డిని వివాహం చేసుకోవడం జరిగింది.పొద్దుటూరులో హెల్త్ క్లబ్ ఫంక్షన్ లో వీరి వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. మహేష్ విట్టా, శ్రావణి పెళ్లి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.. బిగ్ బాస్ హౌస్లో ఉండంగానే తన లవ్ స్టోరీని మహేష్ రివిల్ చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఆమె పేరుని మాత్రం బయటికి చెప్పలేదు..శ్రావణి రెడ్డిని సుమారుగా ఐదేళ్లపాటు ప్రేమించినట్లుగా తెలియజేశారు.. ఆమె కూడా మహేష్ విట్టా చెల్లెలి ఫ్రెండ్ అని కూడా తెలియజేయడం జరిగింది.

అయితే మొదట్లో అతని ప్రేమను శ్రావణి రిజెక్ట్ చేసిన ఆ తర్వాత ఆమెను కన్విన్ చేసి మరి ప్రేమను సాధించినట్లుగా మహేష్ తెలియజేయడం జరిగింది. రెండేళ్లుగా తామిద్దరం స్నేహితులుగా ఉన్నామని ఆ తర్వాతే తమ ప్రేమకు శ్రావణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా తెలియజేసింది. శ్రావణి రెడ్డి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండగా మహేష్ పలు సినిమాలలో రాణించారు.. ప్రస్తుతం మహేష్ విట్టా శ్రావణి రెడ్డికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Vitta (@maheshvitta)