బెజవాడలో తమ్ముళ్ళు తగ్గట్లేదు..జనసేనకే బాబు ఛాన్స్.!

ఎక్కడైనా రాజకీయ పార్టీల్లో ఆధిపత్య పోరు సహజమే. అయితే నేతల మధ్య సఖ్యత లేకపోవడం, అధికారం కోసం లేదా సీట్ల కోసం కుస్తీలు కామన్. ఇక వాటన్నిటిని పార్టీ అధిష్టానాలు చక్కదిద్దుకోవాలి. ఎన్నిసార్లు పరిస్తితులని చక్కదిద్దాలని చూసిన విజయవాడలో తెలుగుదేశం నేతలు మాత్రం సర్దుకునేలా లేరు. ఇక్కడ ఆధిపత్య పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ పోరు వల్ల అక్కడ టి‌డి‌పికి చాలా డ్యామేజ్ జరిగింది.

ఇంకా ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు. దీంతో టి‌డి‌పికి నష్టం గట్టిగా జరిగేలా ఉంది.అక్కడ మొదట నుంచి ఎంపీ కేశినేని నానితో బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా లాంటి వారికి పెద్దగా పడని విషయం తెలిసిందే. ఇక కేశినేనికి చెక్ పెట్టడానికి ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి ఆ నేతలు మద్ధతు ఇస్తూ..విజయవాడ ఎంపీ సీటు ఎసరుకు పెట్టాలని చూస్తున్నారు. దీంతో కేశినేని తగ్గడం లేదు..తమ పార్టీ నేతలకు చెక్ పెట్టేందుకు వైసీపీ ఎమ్మెల్యేలకు మద్ధతుగా నిలుస్తున్నారు. సీటు రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తానని అంటున్నారు.

అయితే ఒకోసారి కేశినేని టి‌డి‌పిలో కార్యక్రమాలు చేస్తారు..ఒకోసారి సొంతంగా పనిచేస్తారు. ఆ మధ్య మహానాడుకు వెళ్లలేదు. ఇటీవల లోకేష్ పాదయాత్ర విజయవాడకు వచ్చిన వెళ్లలేదు. కానీ చంద్రబాబు ఢిల్లీకి వెళితే..ఆయన వెనుకే కేశినేని ఉన్నారు. అంటే కేశినేని లాజిక్ అసలు అర్ధం కాకుండా ఉంది.

ఇక తాజాగా విజయవాడ వెస్ట్ లో టి‌డి‌పి నేత బేగ్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన కేశినేని..ఈ సారి ఎన్నికల్లో తాను ఎంపీగా,బేగ్ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తామని అన్నారు. దీంతో బుద్దా వెంకన్న వర్గం సీరియస్ అయింది..ఈ సారి బుద్దా వెస్ట్ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. కానీ ఈ రచ్చ అంతా లేకుండా బాబు..పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది.