బిగ్ బాస్ సీజన్ 7 మొదటి ఎలిమినేషన్ లోనే.. ఆ హాట్ బ్యూటీ అవుట్..

టాలీవుడ్ బుల్లితెరపై చూస్తూ ఉండగానే బిగ్ బాస్ 6 సీజన్‌ల‌ను పూర్తి చేసుకుని 7వ సీజ‌న్‌ మొదలైపోయింది. మొదటి నుంచి కంటిస్టెంట్ల మధ్యల గొడవలు పెట్టడంలో బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు. ఈ సీజన్లో ఉల్టా పల్టా ఏంటనేది ఇంకా తెలియకపోవచ్చు.. కానీ ఇప్పటికే ఈ సీజన్‌కి అంతకు ముందు వచ్చిన ఆరు సీజన్లకు మధ్య చాలా డిఫరెన్స్ చూపించారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొద‌టి నుంచే కంటెస్టెంట్లు మొదలుపెట్టారు.

ఈ వారం మొత్తం కొద్దిగా ఫ‌నీ కొంత‌ విభేదాలతో నడిచింది. మొదటి రోజు నుంచే బిగ్ బాస్ ఎలిమినేషన్ మొదలుపెట్టేసాడు. చిన్న చిన్న కారణాలు అయినా కూడా అందరూ తమను నచ్చని వారిని ఎలిమినేట్ చేశారు. మొత్తం 8 మంది నామినేట్ కాగా ఆ ఎనిమిది మంది కంటెస్టెంట్లకు చెక్ బాక్సులు ఇచ్చి అందులో పువ్వులు వస్తే సేఫ్.. అస్తిపంజరం వస్తే అన్‌ సేపు అని నాగ్‌ చెప్పాడు. ఎనిమిది మందిలో ఆరుగురికి పువ్వులు వచ్చాయి. చివరిగా ప్రిన్స్‌ యావన్, కిరణ్ రాథోడ్ మిగిలిపోయారు.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో నాగ్‌ విరుద్ధరిలో ఒకరిని ఎలిమినేట్ చేశాడు. ఇక అందరూ ముందుగానే అనుకున్న ప్రకారం కిరణ్ మొదటి ఎలిమినేషన్ అయిపోయింది. కిరణ్‌కు తెలుగు రావడంలేదని, మిగతావారు మాట్లాడే భాషను అర్థం చేసుకోలేకపోతుందని హౌస్ లో కూడా యాక్టివ్ గా ఉండడం లేదని రీజన్ తో ఈమెను హౌస్ లో మెంబర్స్ నామినేట్ చేశారు. ఇక కంటిస్టేంట్‌ల‌తో ఏకీభవించిన ప్రేక్షకులు కూడా ఆమె వచ్చిన దగ్గరి నుంచి లాంగ్వేజ్ అర్థం చేసుకోలేకపోతుందని.. తక్కువ ఓట్లు వేసి బయటకు పంపించేసారు.