Imbd: టాప్-10 లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాలివే..!!

తమ హీరోల సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయా అంటూ అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా ట్రైలర్ విడుదల అయ్యిందంటే చాలు సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తమ హీరోల చిత్రాల రిలీజ్ డేట్ వంటివి ప్రకటిస్తూ మంచి హైప్ ఏర్పడిన సినిమాలు ఉన్నాయి..IMBD సంస్థ ఈ మధ్యకాలంలో అత్యధికంగా మోస్ట్ అవైడెడ్ చిత్రాల గురించి ఒక లిస్టు ని రూపొందించినట్లు తెలుస్తోంది.ఆ లిస్టులో ఏఏ సినిమాలు టాప్ టెన్ లో ప్లేస్ సంపాదించాయి ఒకసారి తెలుసుకుందాం.

 

షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది.. ఈ సినిమా మొదటి స్థానంలో ఉన్నది.. విజయ్ దళపతి, లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న లియో మూవీ అక్టోబర్ 19న విడుదల కాబోతోంది ఈ సినిమా 2వ స్థానంలో ఉన్నది.. ప్రభాస్ ప్రశాంత్ నీలి కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా ఈనెల 28న విడుదల కాబోతోంది.. ఈ చిత్రం మూడవ స్థానంలో ఉన్నది. హడ్డి చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది ఈ సినిమా నాలుగవ స్థానంలో ఉన్నది.

రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న స్కంద సినిమా సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది ఈ సినిమా ఐదవ స్థానంలో ఉంది.. ఇక ఈరోజు విడుదలైన ఖుషి చిత్రం ఆరవ స్థానంలో ఉన్నది.. ది ప్రీలాన్స్ ర్ చిత్రం ఏడవ స్థానంలో ఉన్నది.. అనుష్క, నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది ఈ సినిమా ఎనిమిదవ స్థానంలో ఉన్నది.. రాఘవ లారెన్స్ నటించిన చంద్రముఖి-2 చిత్రం సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతోంది ఈ సినిమా 9వ స్థానంలో ఉన్నది. ది వ్యాక్సిన్ వార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది పదవ స్థానంలో ఉన్నది.