కొడుకు పుట్టాలని అమ్మాయి శ‌వానికి తాళి కట్టిన స్టార్ హీరో.. ఎవరంటే..?

మన భారతదేశం అంటే సాంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇక్క‌డ‌ కొన్ని నమ్మకాలను గట్టిగా నమ్ముతారు. దేవుడు ఉన్నాడని నమ్మే చాలామంది దెయ్యం ఉందని కూడా నమ్ముతూ ఉంటారు. మూఢనమ్మకాలను కూడా గట్టిగా ఫాలో అవుతూ ఉంటారు. ఇటీవల కాలంలో మూఢనమ్మకాల నమ్మడం వల్ల ఎన్నో రకాల దుర్ఘటనలు జరుగుతున్న సంగతి మనం చూశాం. మరి ముఖ్యంగా చదువు రాని వాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు.. కానీ చదువుకొని అన్ని టెక్నాలజీ తెలిసిన వాళ్లు కూడా మూఢనమ్మకాల పేరుతో విచిత్ర సంఘటనలకు పాల్పడుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో కూడా ఇలా మూఢనమ్మకాలను నమ్మి చాలామంది నటీనటులు ఉన్నారు. గత కొంతకాలంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి దగ్గర చాలామంది హీరోయిన్స్ తమ కెరీర్ బాగుండాలని పూజలు చేయించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది పక్కన పెడితే ఓ స్టార్ హీరో చనిపోయిన శ‌వానికి తాళి కట్టాడట.. మరి ముఖ్యంగా కన్యగా చనిపోయిన అమ్మాయికి ఆ హీరో తాళి కట్టాడట. కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగుతున్న నటుడు పెళ్లైనప్పటి నుంచి ఇప్పటివరకు పిల్లలు లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడట.

భార్య భర్తల మధ్యన కూడా ఎన్నో గొడవలు జరుగుతూ ఉండడంతో ఆ గొడవలు అన్నిటిని పక్కనపెట్టి ముందు పిల్లలను కనాలి అనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్ళారట. మీకు పిల్లలు పుట్టాలంటే ఖ‌చ్చితంగా నువ్వు కన్య‌గా చనిపోయిన ఓ అమ్మాయి శ‌వానికి తాళి కట్టాలని ఆ జ్యోతిష్యుడు చెప్పాడట. ఆ నమ్మకాన్ని పట్టుకున్న స్టార్ హీరో నిజంగానే కన్య‌గా చనిపోయిన అమ్మాయి శ‌వానికి తాళి కట్టాడు అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ మూఢనమ్మకాన్ని ఫాలో అయినా ఇంకా స్టార్ హీరోకి పిల్లలు పుట్టలేదు. ఇక ఈ విషయం తెలిసి చాలామంది నెటిజ‌న్‌లు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి పిచ్చి వాళ్ళు ఉన్నారా అంటూ షాక్ అవుతున్నారు.