అనంతలో బాబు..ఆ రెండు సీట్లు సెట్ అవుతాయా?

ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట…రాయలసీమలో మిగిలిన మూడు జిల్లాలు వైసీపీకి కంచుకోటలైతే..అనంత మాత్రం టి‌డి‌పికి అనుకూలమైన జిల్లా. దాదాపు ప్రతి ఎన్నికలో ఇక్కడ టి‌డి‌పి సత్తా చాటింది. 2014లో కూడా చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీకి ఆధిక్యం వస్తే..అనంతలో టి‌డి‌పికి ఆధిక్యం వచ్చింది. 14 సీట్లకు 12 టి‌డి‌పి గెలిచింది. మిగిలిన రెండు సీట్లని కేవలం తక్కువ మెజారిటీలతోనే ఓడిపోయింది.

కానీ 2019 ఎన్నికల్లో అనంతలో టి‌డి‌పికి గట్టి దెబ్బ తగిలింది. కానీ మిగిలిన జిల్లాల్లో ఒక్క సీటు రాకపోయినా అనంతలో రెండు సీట్లు వచ్చాయి. అయితే ఈ సారి ఇక్కడ టి‌డి‌పి ఆధిక్యం సాధించాలని చూస్తుంది. ప్రస్తుతం సర్వేలు చూస్తుంటే వైసీపీకి పోటీగా టి‌డి‌పి ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని సీట్ల విషయంలో క్లారిటీ లేదు. అభ్యర్ధులని ఇంకా తేల్చలేదు. దీంతో టి‌డి‌పిలో కాస్త అంతర్గతంగా విభేదాలు నడుస్తున్నాయి. వాటిని సరిచేసి బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది.

అయితే ఈ నెల 5న బాబు అనంతలో పర్యటిస్తున్నారు. 5వ తేదీన రాయదుర్గంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొంటారు. 6న అనంత అర్బన్ లేదా గుంతకల్ వెళ్తారు. రాయదుర్గంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. కానీ అనంత అర్బన్, గుంతకల్ సీట్ల విషయంలోనే క్లారిటీ లేదు. ఈ రెండు చోట్ల ఆధిపత్య పోరు ఉంది.

అర్బన్ లో ప్రభాకర్ చౌదరీ, గుంతకల్ లో జితేందర్ గౌడ్..ఇంచార్జ్ గా ఉన్నారు. కానీ వారికి సీట్ల దక్కే విషయంలో క్లారిటీ లేదు. దీంతో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేస్తే టి‌డి‌పికి అడ్వాంటేజ్.