జవాన్ మూవీ యాక్టర్స్ ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం జవాన్.. ఇందులో హీరోయిన్ గా నయనతార నటించిన భారి అంచనాల మధ్య నిన్నటి రోజున విడుదలై ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఇందులో ప్రియమణి, దీపికా పదుకొనే కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి రెమ్యూనరేషన్ కూడా భారీ గాని పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించిన నటీనటుల యొక్క ఆస్తి వివరాలు గురించి సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Did you know Nayanthara rejected Jawan co-actor Shah Rukh Khan's Chennai  Express? | PINKVILLA

మొదట బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఇండియన్ హీరోలలో సంపన్న హీరోగా పేరు సంపాదించారు.ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన షారుక్ ఆస్తి విలువ సుమారుగా రూ.6,300 కోట్లు.

నయనతార లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ తెలుగు చిత్రాలలో అలరించింది. ఇప్పటివరకు ఈమె రూ .250 కోట్ల ఆస్తిని సంపాదించినట్టు సమాచారం.

డైరెక్టర్ అట్లీ కోలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈయన ఆస్తి సుమారుగా రూ .50 కోట్లు ఉన్నట్లు సమాచారం.

Jawan Movie - Amazing Secrets - Latest Movies & Web-Series

దీపికా పదుకొనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ ఆస్తి రూ.500 కోట్ల రూపాయలు పైగా ఉన్నట్టు సమాచారం.

సౌత్ ఇండస్ట్రీలోనే మంచి సంపాదించుకున్న హీరో విలన్ విజయ్ సేతుపతి జవాన్ చిత్రంతో కూడా బాలీవుడ్లోకి అడుగుపెట్టారు ఈయన ఆస్తి రూ .150 కోట్లు ఉన్నట్లు సమాచారం.

కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రియమణి సుపరిచితమే.. ఈమె ఆస్తి 60 కోట్లు ఉన్నట్లు సమాచారం.

సింగర్ అనిరుద్ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నికర ఆస్తి విలువ రూ.70 కోట్లు ఉన్నట్లు సమాచారం.