సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారిన జబర్దస్త్ సాయి..!!

జబర్దస్త్ లో చాలామంది లేడీ గెటప్స్ ల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు.. అలాంటి సమయంలో చాలామంది సైతం లింగ మార్పిడి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.. జబర్దస్త్ లేడీ కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇందులో లేడీ గెటప్ వేసేవారు ఒరిజినల్ గా చూస్తే గుర్తుపట్టడం చాలా కష్టమని కూడా చెప్పవచ్చు. మొదట్లో చూడడానికి కాస్త ఎబ్బెట్టుగా అనిపించిన రాను రాను ప్రేక్షకులకు అలాగే అలవాటు పడిపోయారు.. జబర్దస్త్ లేడీ గెటప్ ద్వారా ఫేమస్ అయ్యిన పింకీ బిగ్ బాస్ కి వెళ్లి అందరిని ఆకట్టుకున్నది.

సాయి తేజ్ నుంచి ప్రియాంక సింగ్ గా కూడా మారింది.. లింగమార్పిడి చేయించుకోకుండానే మరో జబర్దస్త్ నటుడు అమ్మాయిగా మారారు… అతడే సాయి.. సాయి లేక అని ఎన్నో స్కిట్లలో తన అందంతో మెస్మరైజ్ చేసిన ఈమె ఈ మధ్యనే సర్జరీ చేయించుకొని లేడీగా మారిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సర్జరీ విషయం పైన ఆమె స్పందించినట్లు తెలుస్తోంది.. అయితే తాను సర్జరీ చేయించుకోలేదని సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయిగా మారుతారా ..నాకు చిన్నతనం నుంచి చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఇలాంటి ఆలోచనలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచే మొదలయ్యాయని తెలిపింది..

అయితే ఎదుటి వాళ్లు ఎలా అనుకుంటారు అనేది తనకి అవసరం లేదని ఎవరు ఏమనుకున్నా నేను అసలు పట్టించుకోను నేను ఇలానే ఉంటాను నేను సర్జరీ చేయించుకుంటే వారెందుకు లేకపోతే వారెందుకు అంటూ కూడా ఘాటుగా సమాధానాన్ని తెలియజేసింది. ప్రస్తుతం సాయి తేజ చేసిన ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.