శ్రీలీలకు కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేనా..?

టాలీవుడ్ లోకి మొదట పెళ్లి సందD అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ శ్రీ లీల.. ఆ తర్వాత రవితేజతో ధమాక చిత్రంతో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో దాదాపుగా డజన్కు పైగా సినిమాలు ఉన్నాయి. ఇటీవల స్కంద సినిమాలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో కూడా తననటనతో అందరిని ఆకట్టుకున్న శ్రీ లీల ఈ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మహేష్ తో గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే ఒకవైపు బాలయ్యకు కూతురు పాత్రలో భగవంత్ కేసరి సినిమాలో కూడా నటిస్తోంది. స్కంద సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ శ్రీలీలకు గతంలో మాదిరిగా ఆఫర్లు రావడం అసాధ్యం అన్నట్లుగా పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్కంద సినిమా తర్వాత శ్రీ లీల వచ్చే నెలలో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా ఈమె కెరియర్ ఉంటుందని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ చిత్రంలో ఈమె హీరోయిన్గా నటించలేదు..

ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా హీరో నటిస్తున్న ఆదికేశవ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ తో గుంటూరు కారం సినిమా వచ్చేయేడాది జనవరి నెలలో విడుదల కాబోతోంది. ఈమె నటిస్తున్న ఎన్నో సినిమాలు వస్తున్నప్పటికీ కేవలం ఈమె అభిమానులు గుంటూరు కారం సినిమా విషయంలోనే ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే శ్రీ లీల కెరియర్ ముందుకు సాగుతుంది. లేకపోతే అంతే అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. స్కంద సినిమాతో నిరుత్సాహపడడంతో అభిమానులు మహేష్ సినిమాపైనే ఆశ పెట్టుకున్నారు. మరి మహేష్ సినిమాతో సక్సెస్ అయ్యి ఈమె కెరియర్ సక్సెస్ బాట అవుతుందేమో చూడాలి. లేకపోతే ఈమె కెరియర్ కూడా చాలా ఇబ్బంది అని కామెంట్స్ వినిపిస్తున్నాను.