తెలుగు ఇండస్ట్రీలో యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ బోయపాటి శ్రీను.. దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న తన సినీ కెరియర్లో కేవలం ఇప్పటికీ 10 సినిమాలను మాత్రమే చేశారు. అందులో మూడు సినిమాలు బాలయ్య హీరోగా చూపించడం జరిగింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి.
అయితే ఇతర హీరోలతో బోయపాటి శ్రీను సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగులుతున్నాయి.. అల్లు అర్జున్తో తెరకెక్కించిన సరైనోడు సినిమా రవితేజతో భద్ర సినిమా తప్ప మరే సినిమాలు బోయపాటి కెరియర్లో సక్సెస్ అందుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. హీరోగా బాలయ్య ఉంటేనే బోయపాటి ఏం చేసిన నడుస్తుందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ తో నిలిచింది. ఇప్పుడు తాజాగా రామ్ తో తెరకెక్కించిన స్కంద సినిమా ఫలితం కూడా అలాగే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
కేవలం శ్రీ లీల వల్లే ఈ సినిమాకి పాజిటివ్ బజ్ ఏర్పడిందని సమాచారం.. అయినా కూడా ఫలితం లేకుండా పోయిందని అసలు ఇప్పటివరకు స్కంద సినిమా ప్రేక్షకులను అలరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున ఈ సినిమా పబ్లిసిటీ చేసిన చిత్ర బృందం.. ఎక్కువగా వైలెన్స్ ఉండడంతో పాటు ఎప్పుడు రాజకీయ నాయకులని టార్గెట్ చేస్తూ సినిమాలను తీస్తూ ఉండే బోయపాటి శ్రీను ఇక మీదట మారకపోతే రాబోయే రోజుల్లో అవకాశాలు ఉండవంటూ పలువురు నెటిజెన్స్ తెలియజేస్తున్నారు.ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల హీరోలు కూడా బొక్క బోర్ల పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.