వర్షం పడుతున్నా కానీ ప్రెగ్నెంట్ టైంలోను అలా చేశా.. సంచలన విషయాన్ని బయటపెట్టిన పూర్ణ..!!

పూర్ణ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మొదటగా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కీలకపాత్రలో నటిస్తూ మెప్పించింది . దుబాయ్ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకున్న ఈమె రీసెంట్ గానే ఓ బాబుకి జన్మనిచ్చింది . బాబు ఫొటోస్ కూడా మీడియాలో వైరల్ గా మారాయి . ఆ తర్వాత మళ్లీ తన లైఫ్ని యధావిధిగా సినిమాలకు రియాలిటీ షోలకు అంకితం చేసిన పూర్ణ రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దసరా సినిమా షూటింగ్ టైంలో తన పడిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.

ఆ టైంలో తాను ప్రెగ్నెంట్ అయినా సరే సినిమా కోసం చాలా కష్టపడ్డాను .అని ఓపెన్ అప్ అయింది . అంతేకాదు చెన్నైలో కొన్ని సీన్స్ చేయాల్సి వచ్చిందని ..అంతేకాకుండా తన సీన్స్ మొత్తం రాత్రులే ఎక్కువగా ఉండేటివి అని ప్రెగ్నెంట్ టైం లో అంత రాత్రులు అ సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపించింది అని చెప్పుకు వచ్చింది . అయితే తన బాధను గమనించిన మూవీ టీం తన కోసం వేడి నీళ్ళు తెప్పించి మరి షూటింగ్లో తన పైన పోసారని ..

అయినా కానీ అంత మంచి సీన్స్ ఎడిటింగ్ లో లేపేసారని బాధపడింది. అంతేకాదు ఓ సీన్లో నైట్ టైం రోడ్డు మీద పరిగెత్తాల్సి వచ్చిందని.. కుక్కల అరుపులు విని తెగ బాధపడ్డాను అని భయపడ్డాను..కానీ అవి కరవలేదని అప్పుడు కూడా మూవీ టీం తనకు ఎంతో సహకరించిందని చెప్పుకొచ్చింది. కానీ ఏం లాభం అన్ని సీన్స్ ఎడిటింగ్ లో లేపేయడం చాలా బాధ కలిగిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది . తాను వర్షంలో తడవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడి ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొనిందట..!!