క‌థ చెప్తుంటే నిద్ర‌పోయిన ప‌వ‌న్ .. త్రివిక్ర‌మ్ చేసిన పనికి అంతా షాక్..కోపం ఎక్కువే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంత మంచి టాలెంటెడ్ రచయిత ..డైరెక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఈయన జాన్ జిగిడి దోస్త్ అన్న పిలుపు ఎప్పటినుంచో ఉంది . పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో త్రివిక్రమ్ ది ఫైనల్ డెసిషన్ అన్న కామెంట్లు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.

మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం ఎలాంటి పనులనైనా చేయడానికి త్రివిక్రమ్ రెడీగా ఉంటాడు అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టంగా కథ చెబుతూ ఉంటే హ్యాపీగా నిద్రపోయారట . ఆ సినిమా మరేదో కాదు అతడు . నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అతడు కథను ఉదయ్ కిరణ్ తో తెరకెక్కించాలనుకున్నారట .

కానీ ఆ టైంకి ఉదయ్ కిరణ్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత ఈ కథను పవన్ కళ్యాణ్ కు వివరించడానికి ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్లారట . కానీ పవన్ కళ్యాణ్ ఈ కథను వింటూ హ్యాపీగా నిద్రపోయారట . ఆ విషయాన్ని చూసుకోకుండా త్రివిక్రమ్ కథ చెప్తూనే ఉండగా లాస్ట్ లో తిరిగి చూడగా పవన్ కళ్యాణ్ నిద్రపోతూ ఉండడంతో మొదట నవ్వుకొని.. ఆ తర్వాత హర్ట్ అయ్యారట. ఫైనల్లీ ఈ కథను మహేష్ బాబుకు వివరించి ఆయన చేత కాల్ షీట్స్ తీసుకొని హిట్ ట్రాక్ అందుకున్నాడు . ఈ సినిమా త్రివిక్రమ్ – మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..!!