“ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదుబే”.. ఇచ్చిపడేసిన బాలయ్య..!!

ప్రజెంట్ నందమూరి బాలకృష్ణ రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే బాలకృష్ణ బావ నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ భారీ కుంభకోణం కేసులు అరెస్ట్ అయ్యారు . అప్పటినుంచి సినిమాలపై కన్నా రాజకీయాల పైన ఎక్కువ ఫోకస్ చేసిన బాలయ్య భగవంత్ కేసరి సినిమా రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి అడిగేసారు అంటూ ప్రచారం జరిగింది .

అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కావడం లేదు అంటూ కొందరు కావాలని తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. దీంతో రంగంలోకి దిగినా అనిల్ రావిపూడి రిలీజ్ డేట్ విషయంలో ఏం మాత్రం మార్పు లేదు అంటూ ఓ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు . ఈ మేకింగ్ వీడియోలో బాలయ్య ఫైర్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు వచ్చే విధంగా ఉంది . అంతేకాదు బాలయ్య నే ఇలా వీడియోను రిలీజ్ చేయమంటూ సజెస్ట్ చేశారట .

తన సినిమా ఆగిపోతుంది అని దొంగ ప్రచారం చేసింది ఎవరో కూడా తనకు తెలుసని.. ఇలాంటివన్నీ పిల్ల బచ్చ గాలు చేస్తూ ఉంటారు అని ఫైర్ అయిపోయారట. అంతేకాదు బాలయ్య ఫ్యాన్స్ అయితే ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అందుకే బాలయ్య సినిమాలోని డైలాగును ట్రెండ్ చేస్తూ సదరు వ్యక్తిని ట్రోల్ చేస్తున్నారు . ఫ్లూట్ జింక ముందు ఊదాలి సింహం ముందు కాదు బాలయ్య రంగంలోకి దిగితే నీకు దబిడి దినిడే అంటూ ఆయన డైలాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు . మొత్తానికి అక్టోబర్ 19 నందమూరి ఫ్యాన్స్ కు పండుగనే చెప్పాలి..!!