దిల్ రాజు రెండో భార్య తేజ‌స్విని బ్యాక్‌గ్రౌండ్ ఇదే…!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దిల్ రాజు అసలు పేరు వి వెంకట రమణారెడ్డి. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన దిల్ రాజు తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా తాను నిర్మించిన సినిమా దిల్.. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈయనకు దిల్ రాజుగా పేరు వచ్చింది. ఇక దిల్ రాజు వ్యక్తిగత విషయానికి వస్తే.. అతని భార్య అనిత 2017లో మరణించింది. వారికి ఓ పాప, ఓ బాబు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇక దిల్ రాజు తన భార్య అనిత చనిపోవడంతో డిప్రెషన్ కి వెళ్ళిపోయాడట. దీంతో తన కూతురు ఎలాగైనా తండ్రిని నార్మల్గా చేయాలని రెండో వివాహం చేయడానికి ఫిక్స్ అయిందట. తండ్రిని బలవంతంగా రెండో పెళ్లికి ఒప్పించిందట. ఇక కూతురు మాట కాదనలేక దిల్ రాజు కూడా పిల్లల కోసం రెండో పెళ్ళికి రెడీ అయ్యాడు. 2020లో తన సొంత ఊరు అయినా నిజామాబాద్ జిల్లాలో నర్సింగ్ పల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడిలో అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్యన దిల్ రాజు వివాహం చేసుకున్నాడు.

ఈ పెళ్ళికి సినీ ప్రముఖులు ఎవరు హాజరు కాలేదు.. కరోనా సమయంలో ఈయన పెళ్లి జరగడంతో ఈ పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. ఇక దిల్ రాజు వివాహం చేసుకున్న తన రెండవ భార్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అట. అయితే ఆమె శంషాబాద్ ఏరియాలో ఏమిర్ హోస్టస్‌గా పని చేస్తుంది. ఆమె అసలు పేరు తేజస్విని కాగా వివాహం తర్వాత వైగా రెడ్డిగా పేరును మార్చుకుంది. ఇటీవల దిల్ రాజు మరోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే.. తన కొడుకు మొదటి పుట్టినరోజులు చాలా గ్రాండ్గా నిర్వహించాడు దిల్ రాజు.