బ‌న్నీకి నేషనల్ అవార్డుపై నెగటివిటీ వెన‌క ఏం క‌థ న‌డుస్తోంది….!

ఇటీవల ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్స్ అవార్డ్ అందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది. పుష్పరాజ్ పాత్రకు జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ రేంజ్.. అంతకంతకు పెరిగిపోయింది. సోషల్ మీడియాలో సహా పలు మెయిన్ స్ట్రీమింగ్‌ మీడియాలో కూడా అల్లు అర్జున్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో పుష్పరాజ్ పాత్రకి జాతీయ అవార్డు ఏంటి అంటూ కొంతమంది నెటిజన్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప పాత్రకి అవార్డు రావడం కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పుష్పలో బన్నిది నెగిటివ్ రోల్ అన్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లు అర్జున్ డబ్బు సంపాదించడం కోసం ఎన్ని అడ్డదారులైన వెతకవచ్చు తప్పులేదు అని ఆలోచనలో ఉండే క్యారెక్టర్ లో నటిస్తాడు. అయితే ప్రస్తుతం ఈ అంశాన్ని పట్టుకొని అల్లు అర్జున్‌పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది. ఇలాంటి పాత్రకి కూడా అవార్డులు ఇస్తారా అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో అవధాని గరికపాటి నరసింహారావు గారు కూడా పుష్పరాజ్ పాత్ర పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజా ఎపిసోడ్లో గరికపాటి రాలేదు కానీ బన్నీ వ్యతిరేక వర్గాలే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని బన్నీ ఫాన్స్ సందేహ‌ పడుతున్నారు. నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న బన్నీ అభిమానులు మాత్రం సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. సినిమాని సినిమాల చూడాలి.. పాత్రను పాత్రలాగే చూడాలి.. తుర‌పై కనిపించే నటుడు నటనను మాత్రమే గుర్తించి అవార్డు ఇస్తున్నారు. జూరీ వాటిని పరిగణలోకి తీసుకుంటుంది.. ఆ కోవలో ఆ పాత్రకి అవార్డు దక్కింది.. అంతేగాని బన్నీని వ్యక్తిగతంగా పిలిచి జాతీయ అవార్డు ఊరికే ఇవ్వ‌లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.